India Vs Bangladesh T20 World Cup 2024: India vs Bangladesh T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ సూపర్- 8లో భారత్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 50 పరుగుల తేడాతో నెగ్గింది. టీమ్ఇండియా నిర్దేశించిన 197 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ తేలిపోయింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమైంది. నజ్ముల్ హసన్ శాంటో (40 పరుగులు) టాప్ స్కోరర్. ఇక భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా చెలో 2, హార్దిక్ పాండ్య 1 వికెట్ దక్కించుకున్నారు. ఇక ఈ విజయంతో భారత్ దాదాపు సెమీస్‌కు చేరినట్లే!
భారీ లక్ష్య ఛేదనలో బంగ్లా ప్రారంభంలో కాస్త ఆచితూచి ఆడింది. ఇక 5వ ఓవర్లో హార్దిక్ భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఓపెనర్ లిటన్ దాస్ (13) క్యాచౌట్‌గా పెలివియన్ చేరాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగినా వికెట్ ఇవ్వకుండా జాగ్రత్తగా ఆడారు. ఇక 9.4 వద్ద బంగ్లా రెండో వికెట్ కోల్పోయింది. తన్జీద్ హసన్ (29) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత బంగ్లా వరుసగా కోల్పోయింది. తౌహిద్ హ్రిదయ్ (4), షకీబ్ అల్ హసన్ (11), నజ్ముల్ హసన్ శాంటో, జాకీర్ అలీ (1), రిషద్ హసెన్ (24) ఔటయ్యారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. భారత్ ఇన్నింగ్స్‌లో ఆదిలోనే చుక్కెదురైంది. దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ 23 పరుగులకే వెనుతిరిగాడు. మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ 37 పరుగుల వద్ద క్లీన్ బౌల్డయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ (6) నిరాశపర్చాడు. మిడిలార్డర్లో రిషభ్ పంత్ (36), ఆ తర్వాత వచ్చిన శివమ్ దూబె (34) రాణించారు. ఆఖర్లో హార్దిక్ పాండ్య (50*) అద్భుత హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో భారత్ 196 పరుగుల భారీ స్కోర్ సాధించగలిగింది. బంగ్లా బౌలర్లలో రిషాద్ హొస్సేన్ 2, తంజిమ్ హసన్ 2, షకిబ్ అల్ హసన్ ఒక వికెట్ పడగొట్టారు.
మ్యాచ్ జరుగుతుంటే స్లీపింగ్- వీళ్లెక్కడి ప్లేయర్లురా బాబు!
ట్రోల్స్‌పై బాబర్ సీరియస్- వాళ్లందరిపై లీగల్ యాక్షన్ - T20 World Cup