ETV Bharat / sports

సాత్విక్, చిరాగ్ అదరహో- థాయ్​లాండ్ ఓపెన్ టైటిల్ కైవసం - Satwiksairaj Chirag Shetty - SATWIKSAIRAJ CHIRAG SHETTY

Satwiksairaj Chirag Shetty Thailand Open: భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ ఆదివారం జరిగిన థాయ్​లాండ్ ఓపెన్ ఫైనల్​లో​ విజయం సాధించింది.

Satwiksairaj Chirag Shetty
Satwiksairaj Chirag Shetty (Source: Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : May 19, 2024, 11:55 AM IST

Updated : May 19, 2024, 12:16 PM IST

Satwiksairaj Chirag Shetty Thailand Open: భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ద్వయం థాయ్​లాండ్ ఓపెన్ పురుషుల డబుల్స్ ఈవెంట్​ ఫైనల్​లో నెగ్గింది. చైనీస్ జోడీ చెన్ బొ యంగ్​- లి యూ తో ఆదివారం జరిగిన ఫైనల్స్​లో సాత్విక్- చిరాగ్ ద్వయం 21-15, 21-15 తేడాతో వరుస సెట్లలో అలవోకగా నెగ్గి టైటిల్ ముద్దాడింది.

ఇండియన్ టాప్ సీడ్ సాత్విక్- చిరాగ్ శెట్టి గేమ్​ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడారు. తొలి రౌండ్​ సగం టైమ్​లో 12-11తో లీడ్​లోకి వెళ్లిన ఈ జోడీ ఏకంగా 21-15తో ముగించింది. ఇక రెండో రౌండ్​లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టాప్ సీడ్ 45 నిమిషాల్లో గేమ్ ముంగించేశారు. 'థాయ్​లాండ్​లో మళ్లీ గెలవడం ఆనందంగా ఉంది. థామస్​కప్​తో పాటు ఇక్కడ మాకు ఇది తొలి సూపర్ ఫోర్ సిరీస్' అని సాత్విక్- చిరాగ్ మ్యాచ్ అనంతరం మాట్లాడారు.

Last Updated : May 19, 2024, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.