IND VS Zimbabwe T20 series VVS Laxman Salary : 2024 టీ20 వరల్డ్ కప్ పూర్తవ్వగానే టీమ్ ఇండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవి కాలం కూడా పూర్తైపోయింది. దీంతో రెండున్నరేళ్ల పాటు పదవిలో ఉన్న అతడు రాజీనామా చేశాడు. అతని పదవీ కాలంలో టీమ్ఇండియా అద్భుతంగా రాణించింది. గతేడాది టెస్ట్ ఛాంపియన్‌షిప్, వన్డే వరల్డ్ ఫైనల్స్‌కు చేరింది. ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచింది. అయితే ప్రస్తుతం భారత జట్టు జింబాబ్వే పర్యటనలో ఉంది. ఈ సిరీస్‌కు తాత్కాలిక కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తున్నాడు. మరి తాత్కాలికగా కోచ్‌గా వ్యవహరిస్తున్న లక్ష్మణ్‌కు ఒక సిరీస్‌కు ఎంత శాలరీ ఇస్తారో తెలుసా?
- లక్ష్మణ్ శాలరీ ఎంత?
గతంలో కూడా ద్రవిడ్ అందుబాటులో లేనప్పుడు, లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించాడు. ప్రస్తుతం బీసీసీఐ, కొత్త కోచ్‌ను ఎంపిక చేసుకునే ప్రక్రియలో ఉంది. ద్రవిడ్ పదవీ విరమణతో ఖాళీ ఏర్పడటంతో మళ్లీ తాత్కాలిక్ కోచ్‌గా లక్ష్మణ్ వచ్చాడు. తన తాత్కాలిక కోచ్ పాత్రకు వీవీఎస్ లక్ష్మణ్ రూ.50 లక్షల జీతం అందుకుంటున్నట్లు సమాచారం. పూర్తి స్థాయి కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ వార్షిక వేతనం రూ.12 కోట్లు. అంటే ఈ పర్యటన కోసం లక్ష్మణ్ అందుకుంటున్న మొత్తం ద్రవిడ్ వార్షిక వేతనంలో 4.16% కావడం గమనార్హం. - యువకుల జట్టును నడిపిస్తున్న లక్ష్మణ్
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) చీఫ్‌గా కూడా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ జింబాబ్వే పర్యటనలో భారత క్రికెట్ జట్టును నడిపిస్తున్నాడు. ఈ పర్యటనలో భారత్ మొత్తం ఐదు టీ20లు ఆడుతుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. మొదటి మ్యాచ్‌లో బింబాబ్వే 13 పరుగులతో గెలిచి ఇండియాకి షాక్ ఇచ్చింది. రెండో మ్యాచ్‌లో భారత యువకుల జట్టు స్థాయి మేరకు రాణించింది. జింబాబ్వేని 100 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇప్పుడు 1-1తో సిరీస్ సమంగా నిలిచింది. . - తాత్కాలిక కోచ్ పాత్ర
ప్రధాన కోచ్‌గా లక్ష్మణ్ పాత్ర తాత్కాలికమే. జింబాబ్వే పర్యటన తర్వాత బీసీసీఐ కొత్త కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను ప్రకటించే అవకాశం ఉంది. అంటే లక్ష్మణ్ జింబాబ్వే టూర్ వరకు మాత్రమే జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తాడు. - పర్యటన షెడ్యూల్
మొదటి రెండు టీ20లకు అందుబాటులో లేని సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే స్వదేశానికి తిరిగొచ్చారు. మూడో టీ20లో టీమ్ ఇండియా ఫైనల్ 11లో మార్పులు ఉండవచ్చు. జులై 10న మూడో టీ20, జులై 13న నాలుగో టీ20 జరుగుతాయి. జులై 14న చివరి టీ20తో సిరీస్ పూర్తవుతుంది.
BCCI నెట్‌వర్త్ రూ.19,000 కోట్లు! - బోర్డుకు ఆదాయం ఎలా వస్తుందో తెలుసా? - BCCI Net worth