TeamIndia Head Coach Gautam Gambhir on Kohli Rohith Sharma : భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను నియమిస్తూ బీసీసీఐ ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అతడి ఆధ్వర్యంలోనే శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు భారత్ (IND vs SL) అక్కడికి బయల్దేరనుంది. ఇప్పటికే ఈ టూర్‌కు వెళ్లే ప్లేయర్స్ ఎంపిక జరిగిపోయింది. ఈ క్రమంలో బీసీసీఐ ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా మొదటి సారి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు గంభీర్. ఇందులో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా పాల్గొన్నాడు. ఈ ఇద్దరూ కీలక ప్లేయర్స్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్ గురించి మాట్లాడారు.
అదే మొదటి ప్రాధాన్యత - "ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన జట్టును ముందుకు నడిపించేందుకు వచ్చాను. జట్టులోని ప్రతి ఒక్కరితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. బీసీసీఐ కార్యదర్శి జైషా కూడా బాగా తెలుసు. సోషల్ మీడియాలో చాలా విషయాలపై కామెంట్స్ వినిపిస్తుంటాయి. వాటిన్నింటినీ పక్కన పెట్టి మా బాధ్యతలపై దృష్టి పెడతాం. ఇక్కడ గౌతమ్ గంభీర్ ముఖ్యం కాదు. టీమ్ఇండియానే మొదటి ప్రాధాన్యత. బీసీసీఐతో నేను కంఫర్ట్‌గానే ఉన్నాను. నేను అడిగినవన్నీ బోర్డు సమకూర్చింది. శ్రీలంక పర్యటన తర్వాత కచ్చితమైన సహాయక సిబ్బంది గురించి చెబుతాం." అని గంభీర్ పేర్కొన్నాడు.
అలానే కొనసాగాలని ఆశిస్తున్నాను - "కోహ్లీ, రోహిత్ ఇకపై కేవలం రెండు ఫార్మాట్లలో మాత్రమే ఆడతారు. కాబట్టి వీలైనంత ఎక్కువ మ్యాచులకు వారు అందుబాటులో ఉంటారని భావిస్తున్నాను. టీ20 ప్రపంచకప్ లేదా వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ, రోహిత్ తమ సత్తా ఏంటో వారు చూపించారని నేను భావిస్తున్నాను. వారిద్దరిలో ఇంకా చాల క్రికెట్ దాగి ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆస్ట్రేలియా టూర్ కోసం వారిని పరిగణలోకి తీసుకుంటాం. 2027 ప్రపంచకప్ వరకు వారి ఫిట్నెస్ ఇలానే కొనసాగుతుందని ఆశిస్తున్నాను. అయితే వారిలో ఎంత క్రికెట్ దాగి ఉన్నదో నేను చెప్పలేను. అంతిమంగా వారు జట్టు విజయానికి ఎంతవరకు దోహదపడాలనేది వారి ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటుంది. వారిద్దరు ఇప్పటికీ వరల్డ్ క్లాస్ క్రికెటర్లు. ఏ జట్టైనా అలాంటి ఆటగాళ్లు వీలైనంత ఎక్కువకాలం తమతో ఉండాలనే కోరుకుంటుంది. కోహ్లీ, రోహిత్ ఇకపై కేవలం రెండు ఫార్మాట్లలో మాత్రమే ఆడతారు. కాబట్టి వీలైనంత ఎక్కువ మ్యాచులకు వారు అందుబాటులో ఉంటారని భావిస్తున్నాను. చూడాలి మరి వారు తమ ప్రదర్శనను ఎలా కొనసాగిస్తారో" అని గంభీర్ పేర్కొన్నాడు.
హామీ ఇస్తున్నాను - "ప్లేయర్స్‌కు స్వేచ్ఛ ఇవ్వడమే ఎంతో ముఖ్యం. ప్రతి ప్లేయర్‌పై నమ్మకం ఉంచి వారిని ప్రోత్సహించేందుకు ప్రయత్నించడమే నా పని. నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రతి ఒక్క ఆటగాడికి హామీ ఇస్తున్నాను. ఎప్పుడు సంతోషంగా ఉండే డ్రెస్సింగ్ రూమే సక్సెస్ అవుతుంది. అదే విధంగా నా సహాయక సిబ్బంది కూడా ఎంతో సపోర్టివ్‌గా ఉంటారు. ఏ విషయాన్ని కూడా సంక్లిష్టంగా మార్చాను. నేనూ అలా ఉండను. సహాయ సిబ్బంది గురించి ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదు. లంక పర్యటన తర్వాత దీనిపై మరింత స్పష్టత వస్తుంది." అని వెల్లడించాడు.
రూ.15,490 కోట్లతో క్రీడా గ్రామం - అథ్లెట్ల కోసం 3 లక్షల కండోమ్‌లు! - Paris Olympics 2024
క్రికెట్ దిగ్గజం ఆరోగ్య పరిస్థితి విషమం - టెన్షన్లో ఫ్యాన్స్ - Geoffrey Boycott Health Condition