ETV Bharat / sports

మూడో టీ20కి భారత్​ రెడీ- సిరీస్​లో ముందడుగు ఎవరిదో?

భారత్ x సౌతాఫ్రికా : సెంచూరియన్​లో హవా ఎవరిదో

IND vs SA 3rd T20 2024
IND vs SA 3rd T20 2024 (Source: Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 13, 2024, 7:01 AM IST

IND vs SA 3rd T20 2024 : సౌతాఫ్రికా పర్యటనలో భారత్ మూడో టీ20కి సిద్ధమైంది. సెంచూరియన్ వేదికగా బుధవారం మూడో మ్యాచ్​ జరగనుంది. నాలుగు మ్యాచ్​ల సిరీస్​లో తొలి టీ20లోనెగ్గిన టీమ్ఇండియా, ఆపై ఓడింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. దీంతో ఈ మ్యాచ్‌ ఓడితే సిరీస్‌ సాధించే ఛాన్స్​ ఉండదు. అందుకని మూడో మ్యాచ్​లో నెగ్గి సిరీస్​లో ముందడుగు వెయ్యాలని భారత్ భావిస్తోంది.

వాళ్లు ఈసారైనా
ఈ సిరీస్​లో యువ ఆటగాడు ఆభిషేక్ శర్మ భారీ అంచనాలతో బరిలోకి దిగాడు. కానీ, వరుసగా రెండు మ్యాచ్​ల్లో సింగిల్ డిజిట్ స్కోర్​కే పెవిలియన్ చేరాడు. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడే స్వభావం ఉన్న అభిషేక్ అనవసర షాట్లకు పోయి, వికెట్ సమర్పించుకుంటున్నాడు. ఇకనైనా అభిషేక్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. లేదంటే జట్టులో స్థానం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నుంచి ఇప్పటిదాకా భారీ ఇన్నింగ్స్ రాలేదు. సూర్య కూడా వరుసగా విఫలమయ్యాడు. బ్యాటింగ్​కు సహకరించే సెంచూరియన్ పిచ్​పై సూర్య చెలరేగాల్సిన అవసరం ఉంది. మరో కుర్రాడు తిలక్ వర్మ నిలకడగా రాణిస్తున్నాడు. ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య టచ్​లోకి వచ్చాడు. వీళ్లలో ఏ ఒక్కరైనా రాణిస్తే, భారత్​కు భారీ స్కోర్ ఖాయం.

కళ్లన్నీ అతడిపైనే
సౌతాఫ్రికా అంటే పేస్‌ పిచ్‌ల అడ్డా. అక్కడ పేసర్లదే హవా. కానీ, ఇప్పుడు అక్కడి పిచ్‌లు స్పిన్‌కు కూడా కొంత సహకరిస్తున్నాయి. ఆ సహకారాన్ని భారత స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి గొప్పగా వినియోగించుకుంటున్నాడు. తొలి మ్యాచ్‌లో 3, రెండో టీ20లో ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు రవి బిష్ణోయ్‌ కూడా సత్తా చాటుతున్నాడు. ఈ నేపథ్యంలో వీళ్లపైనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

ఊపుమీదున్న సౌతాఫ్రికా
సౌతాఫ్రికా సిరీస్‌లో తొలి విజయం ఇచ్చిన ఊపులో మరో గెలుపు నమోదు చేయాలన్న ఊపుమీదుంది. అయితే ఆ జట్టుకు కూడా బ్యాటింగ్​ సమస్యలు ఉన్నాయి. మార్‌క్రమ్, క్లాసెన్‌ లాంటి మేటి బ్యాటర్లు బ్యాట్లు తక్కువ స్కోర్లకే ఔట్ అవుతున్నారు. టాప్‌ ఆర్డర్‌ తేలిపోతోంది. రెండో టీ20లో స్టబ్స్‌ పుణ్యమా అని ఆ జట్టు గట్టెక్కింది. కానీ, ఆ మ్యాచ్‌లో సఫారీ బౌలింగ్‌ మాత్రం ఉత్తమంగా సాగింది. యాన్సెన్, కొయెట్జీ, పీటర్‌ జోరుమీదున్నారు. ఇదే ఊపులో సిరీస్​లో పైచేయి సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు.

భారత్ జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేశ్​ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్ , విజయకుమార్ వైశాక్, అవేష్ ఖాన్, యశ్​ దయాల్.

సిక్సర్​గా స్టేడియం దాటిన బంతి - జేబులో పెట్టుకుని పరారైన వ్యక్తి!

ఒకే ఏడాదిలో 100 సిక్స్​లు - క్లాసెన్ కెరీర్​లో రేర్​ రికార్డు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.