ETV Bharat / sports

'రోహిత్, విరాట్ నీ ఫ్రెండ్స్ అనుకో'- అఫ్రిదీ​ని టీజ్ చేసిన టీమ్ఇండియా ఫ్యాన్స్ - T20 World Cup 2024

Ind vs pak T20 World Cup: న్యూయార్క్‌లో జరుగనున్న భారత్‌- పాక్‌ మ్యాచ్‌ చూసేందుకు ఇండియన్‌ ఫ్యాన్స్‌ ఆసక్తి ఎదురుచూస్తున్నారు. మ్యాచ్‌కి ముందు కొందరు అభిమానులు పాకిస్థాన్ పేసర్‌ షాహిన్‌ షా అఫ్రిదిని కలిశారు. అతడితో ఏం మాట్లాడారంటే?

Ind vs pak T20 World Cup
Ind vs pak T20 World Cup (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 8, 2024, 8:42 PM IST

Ind vs pak T20 World : 2024 టీ20 వరల్డ్‌కప్‌లో జూన్‌ 9న ఆదివారం చిరకాల ప్రత్యర్థులు భారత్‌- పాకిస్థాన్‌ ఢీకొట్టబోతున్నాయి. క్రికెట్‌ ఫ్యాన్స్‌ అందరూ ఈ హైఓల్టేజ్‌ మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్​కు పాకిస్థాన్‌ పేసర్‌ షాహీన్ షా ఆఫ్రిది రూపంలో ముప్పు పొంచి ఉంది. ఇటీవల యూఎస్‌ఏతో ఆడిన మ్యాచ్‌లో అతడు పెద్దగా రాణించకపోయినా, తనదైన రోజున షాహీన్‌ షా ఎంత ప్రమాదకరమో అందరికీ తెలుసు. అయితే శనివారం అమెరికాలో కొంతమంది టీమ్ఇండియా ఫ్యాన్స్ అఫ్రిదీతో ముచ్చటించారు. సరదాగా కొన్ని ప్రశ్నలు అడిగారు. షాహీన్‌ కూడా నవ్వుతూ రెస్పాండ్‌ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

టీమ్ఇండియ ఫ్యాన్స్‌తో సరదాగా!
కొంతమంది ఇండియన్‌ ఫ్యాన్స్‌ న్యూయార్క్‌లో అఫ్రిదీతో మాట్లాడుతున్న, ఫొటోలు తీసుకుంటున్న వీడియో సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతోంది. వీడియోలో ఓ అభిమాని అఫ్రిదీని ఉద్దేశించి మాట్లాడాడు. 'భారత్‌పై నువ్వు మంచి స్పెల్ వేయొద్దు. రేపు ఒక్క రోజు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని నీ ఫ్రెండ్స్‌ అనుకో' అని అఫ్రిదీతో అన్నారు. దీంతో అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. అఫ్రిదీ ఇండియన్‌ ఫ్యాన్స్‌తో కూల్​గా, ఫన్నీగా ఉన్నాడు. అందరికీ సరదాగా నవ్వుతూ బదులిచ్చాడు.

షాహీన్‌ అఫ్రిదీ ప్రమాదరకమే!
లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిది, పాకిస్థాన్‌ టీమ్‌లో టాప్‌ ప్లేయర్‌. కొన్నేళ్లుగా పాక్‌ విజయాల్లో కీలక పాత్ర పోసిస్తున్నాడు. బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేయగలడు. ముఖ్యంగా లిమిటెడ్‌ ఓవర్స్‌ క్రికెట్‌లో అఫ్రిదీ మరింత ప్రమాదకరం. టీ20, వన్డేల్లో అద్భుత గణాంకాలు నమోదు చేశాడు. ఇప్పటి వరకు టీమ్ఇండియాపై రెండు టీ20లు ఆడాడు. దుబాయ్‌లో జరిగిన 2021 టీ20 వరల్డ్‌కప్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 4 ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి, 31 పరుగులు ఇచ్చాడు. పాక్‌ విజయంలో ఈ స్పెల్‌ కీలకం అయింది. ఆ మ్యాచ్​లో భారత్​పై పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

భారత్ x పాక్: టీ20 వరల్డ్​కప్​లో దాయాదుల చరిత్ర- 2007 నుంచి ఎలా సాగిందంటే? - T20 World Cup 2024

ఇండియా x పాక్ మ్యాచ్ టికెట్లు అన్​సోల్డ్!- ఇట్స్ మిరాకిల్- కారణం అదేనా? - T20 World cup 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.