IND VS NZ Rohith Sharma with Lady Fan : టీమ్ ఇండియాలో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోహిత్ ఆటతీరుకు, విరాట్ ఆటతీరుతో పాటు స్టైల్ అండ్ ఆటిట్యూడ్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వీరు కనపడితే చాలు, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు, ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎంతగానో ట్రై చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే ఎగబడుతుంటారు. అయితే తాజాగా ఓ మహిళా అభిమానితో రోహిత్ శర్మ ముచ్చటించాడు. ఆ సమయంలో సదరు మహిళ కోహ్లీ గురించి మాట్లాడగా, హిట్ మ్యాన్ చెప్పిన సమాధానం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఏం జరిగిందంటే? - ప్రస్తుతం టీమ్ ఇండియా న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. తొలి మ్యాచ్‌లో ఘోరంగా ఓడిన మన వాళ్లు రెండో టెస్ట్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నారు. ఈ మ్యాచ్ పుణె వేదికగా జరగనుంది. ఈ క్రమంలోనే ఎమ్సీఏ స్టేడియంలో మనోళ్లు ప్రాక్టీస్ సెషన్‌కు హాజరయ్యారు. ఆ సమయంలోనే స్టేడియానికి వచ్చిన ఓ మహిళ అభిమాని రోహిత్‌తో మాట్లాడింది. ఆటోగ్రాఫ్ కావాలని అడిగింది. ఆమె అడిగిన తీరుకి రోహిత్ ముచ్చటపడి ఆగి మరీ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. కానీ ఆమె చివర్లో 'విరాట్ కోహ్లీకి కూడా నేను పెద్ద ఫ్యాన్‌ను అడిగానని చెప్పండి' అంటూ హిట్ మ్యాన్‌తో చెప్పింది. అప్పుడు రోహిత్ కూడా సానుకూలంగా స్పందించాడు. 'తప్పకుండా చెబుతాను' అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
మహిళా అభిమానితో రోహిత్ సంభాషణ
మహిళా అభిమాని - రోహిత్ భాయ్, ప్లీజ్ ఆటోగ్రాఫ్ ఇవ్వండి
రోహిత్ - వెయిట్, వస్తున్నాను.
మహిళా అభిమాని - థ్యాంక్యూ సో మచ్, విరాట్‌కు కూడా చెప్పండి, తన బిగ్ ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చిందని.
రోహిత్ - హా కచ్చితంగా చెబుతాను(నవ్వుతూ)
కాగా, బెంగళూరు టెస్టులో భారత్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకుని ఆడినా ఫలితం దక్కలేదు. దీంతో సొంత గడ్డపై భారత్ జట్టు పరువు పోయినంత పని అయింది. అందుకే రెండో టెస్టులో న్యూజిలాండ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని కసితో ఉంది. పైగా, ఈ మూడు టెస్ట్‌ల సిరీస్‌లో చివరి రెండు టెస్ట్‌లు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే పుణె పిచ్‌పై రాణించేందుకు భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. పుణెలో స్పిన్ పిచ్‌తో కివీస్‌ను దెబ్బతీయాలని భావిస్తున్నారు.
Rohit Sharma's conversation with a fan:
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 22, 2024
Fan - Rohit bhai, please give autograph.
Rohit - I'm coming, wait.
Fan - thank you so much, tell Virat also that his big fan came here.
Rohit - I'll tell Virat. 😄❤️pic.twitter.com/q0fUWHtcWm
'దానికి మించింది మరొకటి లేదు' - రొటేషన్ పాలసీపై ధోనీ కీలక కామెంట్స్!
'ఒక్కఫోన్ కాల్ చేయండి చాలు - వచ్చేస్తా' : సర్ప్రైజ్ ఇచ్చిన వార్నర్