ETV Bharat / sports

ఆఖరి సమరంలో పరువు కాపాడుకునేందుకు - 35 మంది నెట్‌ బౌలర్లతో భారత్ ప్రాక్టీస్​!

మూడో టెస్ట్​కు సిద్ధమైన న్యూజిలాండ్​ - టీమ్ ఇండియా

IND VS NZ 3rd Test
IND VS NZ 3rd Test (Source IANS)
author img

By ETV Bharat Sports Team

Published : 3 hours ago

IND VS NZ 3rd Test : భారత్‌ గడ్డపై మూడు టెస్టుల సిరీస్‌ అంటే, రెండు మ్యాచ్‌లు పూర్తయ్యేసరికే టీమ్‌ ఇండియా సిరీస్‌ సొంతం చేసుకుని, క్లీన్‌ స్వీప్‌ లక్ష్యంగా చివరి మ్యాచ్‌కు రెడీ అవుతుంటుంది. ఈ ఒక్కటైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ప్రత్యర్థి జట్టేమో కసితో ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. కానీ ఈసారి కథ మారింది.

న్యూజిలాండ్ దెబ్బకు భారత్‌ విలవిలలాడింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో కివీల్​ చేతిలో పరాజయం చెందింది తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడేమో మూడో మ్యాచులో గెలిచి పరువు కోసం పోరాడే పరిస్థితిలో పడింది. ఇప్పుడీ మూడో మ్యాచులో గెలవకపోతే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్త్ అర్హత కూడా ప్రమాదంలో పడినట్టువుతుంది.

ఆ ఇద్దరు ఇక ఆడాల్సిందే? - పన్నెండేళ్లుగా సొంతగడ్డపై సిరీసే కోల్పోని టీమ్‌ఇండియా రికార్డుకు కివీస్ గండికొట్టింది. ఫలితంగా ఈ సిరీస్‌లో భారత జట్టు సమష్టిగా ఘోరంగా విఫలమైంది. బ్యాటింగ్‌ అయితే మరీ దారుణం. బెంగళూరు టెస్ట్​లో 46 పరుగులకే ఔట్ అయిన జట్టు, పుణె టెస్ట్​లో 156 పరుగులకు కుప్పకూలింది. సీనియర్‌ ప్లేయర్స్​ కోహ్లీ, రోహిత్‌ శర్మ కూడా పేలవ ప్రదర్శన చేశారు. రోహిత్‌ వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 2, 52, 0, 8 పరుగులు చేయగా, విరాట్​ 0, 70, 1, 17 స్కోర్లు మాత్రమే నమోదు చేశాడు. దీంతో వీరిద్దరినీ జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాబట్టి హిట్ మ్యాన్, కోహ్లీ తమ స్థాయికి తగ్గ భారీ ఇన్నింగ్స్‌లు ఆడాల్సిందే. జట్టుకు భారీ స్కోరు అందించే బాధ్యత వారిపైనే ఉంది.

ఇకపోతే ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఫామ్‌లో ఉండడం విశేషం. శుభ్‌మన్‌ మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. పంత్, సర్ఫరాజ్‌ బెంగళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో చేసిన ప్రదర్శనను కొనసాగించాలి.

బౌలింగ్‌ విషయానికొస్తే అశ్విన్, జడేజా రెండో టెస్ట్​లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయారు. పుణె టెస్టు కోసం అనూహ్యంగా జట్టులోకి వచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌ మంచి ప్రదర్శన చేశాడు. ఈ స్పిన్‌ త్రయం వాంఖడె పిచ్‌ను సద్వినియోగం చేసుకుని ప్రత్యర్థిని అడ్డుకోవాలి. బుమ్రా, ఆకాశ్‌దీప్‌ జోడీ ప్రారంభంలో వికెట్లు తీయడం అవసరం.

IND VS NZ 3rd Test Pitch : ఇక న్యూజిలాండ్ విషయానికొస్తే మరోసారి సమష్టి కృషితో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని పట్టుదలతో ఉంది. బ్యాటింగ్‌లో రచిన్‌ రవీంద్ర, కాన్వే, ఫిలిప్స్, లేథమ్‌ ఫామ్​లో ఉండటం కలిసొచ్చే విషయం. పేసర్లు హెన్రీ, ఒరోర్క్, సౌథీ, స్పిన్నర్లు శాంట్నర్, అజాజ్‌ పటేల్‌తో బౌలింగ్‌ కూడా బలంగా అనిపిస్తోంది. మ్యాచ్‌ వేదికైన వాంఖడె స్టేడియం పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. మొత్తంగా స్పిన్నర్లకు ఓ మోస్తరుగా సహకరిస్తూనే బ్యాటర్లకు ఇబ్బంది లేకుండా వికెట్‌ను సిద్ధం చేశారట.

35 మంది నెట్‌ బౌలర్లతో - తొలి రెండు టెస్టుల్లో ఓటమి చెందడంతో మూడో టెస్ట్ కోసం గట్టిగా ప్రాక్టీస్ చేస్తోంది టీమ్ ఇండియా. ముంబయి క్రికెట్‌ సంఘం స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్​లో 35 మంది నెట్‌ బౌలర్లను వినియోగించింది. వీరిలో ఎక్కువమంది స్పిన్నర్లే. భిన్నమైన బౌలింగ్‌ శైలి కలిగిన స్పిన్నర్లను ఎదుర్కొని మనోళ్లు సాధన చేశారు.

IPL రిటెన్షన్స్: RTM కార్డ్ నయా రూల్- ఎవరికి లాభం?

టాప్​-10 నుంచి కోహ్లీ, పంత్ ఔట్​​ - బౌలింగ్​లో బుమ్రా డౌన్​, దూసుకెళ్లిన రబాడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.