IND VS New Zealand Kohli Duck Out Record : న్యుజిలాండ్తో ప్రారంభమైన తొలి టెస్ట్‌లో టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు. తొమ్మిది బంతులు ఎదుర్కొన్న అతడు పరుగుల ఖాతా తెరవలేకపోయాడు. విలియమ్ ఓరూర్కీ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ సూపర్ క్యాచ్ పట్టుకోవడంతో విరాట్ పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది.
సాధారణంగా సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగే కోహ్లీ, యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ గైర్హాజరీ అవ్వడం వల్ల ఈసారి ముందు రావాల్సి వచ్చింది. అయితే అతడికి మరోసారి ఈ వన్‌డౌన్ కలిసి రాలేదనే చెప్పాలి. చివరి సారిగా 2016లో వెస్టిండీస్‌పై విరాట్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. ఆ మ్యాచ్‌లోనూ రెండు ఇన్నింగ్స్‌ల్లో 3, 4 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇప్పటివరకు టెస్టుల్లో అతడు నాలుగు మ్యాచుల్లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. దిగిన ప్రతీసారి కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 97 పరుగులు చేశాడు. అతడి అత్యధికం 41 పరుగులు మాత్రంగానే ఉంది.
చెత్త రికార్డు - తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 9 బంతులను మాత్రమే ఎదుర్కొన్న విరాట్ ఒక్క పరుగు కూడా చేయలకేపోయాడు. ఈ క్రమంలో ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. అంతర్జాతీయంగా కోహ్లీకి ఇది 38వ డకౌట్. దీంతో ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్లలో టిమ్ సౌథీ (38)తో సంయుక్తంగా నిలిచాడు. వీరిద్దరి తర్వాత రోహిత్ శర్మ (33) కొనసాగుతున్నాడు. అన్ని ఫార్మాట్లు కలిపి మొత్తంగా ముత్తయ్య మురళీ ధరన్ (59) ఈ చెత్త రికార్డులో ముందున్నాడు.
రెండో భారత క్రికెటర్‌గా - టీమ్‌ఇండియా తరఫున అత్యధిక మ్యాచులు ఆడిన రెండో ప్లేయర్‌గా కోహ్లీ ఘనత సాధించాడు. తుది జట్టులో స్థానం దక్కించుకున్న వారి జాబితాలో సచిన్(664 మ్యాచులతో) అగ్రస్థానంలో ఉండగా, కోహ్లీ 536 మ్యాచులతో రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు ధోనీతో 535 మ్యాచులతో కలిసి సంయుక్తంగా కొనసాగడు. రాహుల్ ద్రవిడ్ 504 మ్యాచులతో నాలుగో స్థానంలో, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ 486 మ్యాచులతో ఐదో స్థానాల్లో ఉన్నారు.
హమ్మయ్య తొలి టెస్ట్ ప్రారంభం - తుది జట్టులో ఆ ఇద్దరికి అవకాశం