IND VS New Zealand 1St Test Rain : న్యుజిలాండ్తో టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధిమైన టీమ్ ఇండియాను వరుణుడు ఇబ్బండి పెడుతున్నాడు. భారత క్రికెట్ అభిమానులు కూడా నిరాశ చెందుతున్నారు. బెంగళూరు చినస్వామి స్టేడియం వేదికగా నేడు(అక్టోబర్ 16) తొలి మ్యాచ్ ప్రారంభం కావాల్సింది. కానీ ఇంకా మొదలు కాలేదు. టాస్ కూడా పడలేదు. దీంతో తొలి రోజు ఆట జరుగుతుందా లేదా అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
అత్యాధునిక టెక్నాలజీతో సబ్ ఎయిర్ సిస్టమ్
ఎంత పెద్ద వర్షం పడినా, అది ఆగగానే మ్యాచ్‌ను నిర్వహించే గలిగేలా టెక్నాలజీ బెంగళూరు చినస్వామి స్టేడియంలో ఉంది. నిమిషానికి ఏకంగా పది వేల లీటర్ల నీటిని పీల్చేయగల సామర్థ్యం కలిగిన సబ్ ఎయిర్ సిస్టమ్ మైదానంలో ఉంది. అంటే ఈ సిస్టమ్‌తో వర్షం ఆగిన కాసేపటికే పిచ్‌తో పాటు మైదానం చిత్తడిగా లేకుండా చేయొచ్చు. అయితే స్టేడియం దగ్గర ఇప్పటికే గత రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. ఈ రోజు కూడా వర్షం ఆగకుండా కొనసాగితే మాత్రం తొలి రోజు ఆటను చూసే అవకాశం ఉండకపోవచ్చనే చెప్పాలి.
అసలీ సబ్ ఎయిర్ సిస్టమ్ ఏం చేస్తుంది?
కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ దాదాపు 10 ఏళ్ల క్రితం సబ్ ఎయిర్‌సిస్టమ్‌ను మైదానంలో ప్రవేశపెట్టింది. మొదటి సారి 2015లో టీమ్ ఇండియా - సౌతాఫ్రికా టెస్టు మ్యాచ్ కోసం ఈ పద్ధతిని స్టేడియంలోకి తీసుకొచ్చింది. దీని వల్ల నీరు మైదానంలో ఉండకుండా మెషిన్ స్టార్ట్ చేయగానే బయటకు వెళ్లిపోతుంది. ఇందు కోసం 200 హార్స్‌పవర్ యంత్రాలతో సబ్ ఎయిర్ సిస్టమ్ రన్ అవుతుంది. అక్కడి నుంచి నీరును డ్రైనేజ్‌ల ద్వారా బయటకు పంపించేస్తారు. ఆ తర్వాత డ్రయర్లు, రోప్స్‌తో మైదానాన్ని పిచ్న సిద్ధం చేస్తారు.
భారత్: రోహిత్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్/సర్ఫరాజ్, కోహ్లి, పంత్, రాహుల్, జడేజా, అశ్విన్, ఆకాశ్‌దీప్/కుల్‌దీప్, బుమ్రా, సిరాజ్;
న్యూజిలాండ్: కాన్వే, లేథమ్, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, మిచెల్, బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, బ్రాస్‌వెల్, సౌథీ, అజాజ్, ఒరూర్కె.
భారత్. న్యుజిలాండ్ తొలి టెస్ట్ - OTTలో ఎక్కడ చూడాలంటే?
36 ఏళ్లుగా ఒక్క విజయం లేదు - భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్టుల్లో ఎవరిది పైచేయి?