ETV Bharat / sports

టీమ్​ఇండియాకు బిగ్ షాక్​ - రెండో టెస్టులో సెంచరీ హీరోకు గాయం

IND VS ENG Gill Injured : ఇంగ్లాండ్​తో జరుగుతున్న రెండో టెస్టులో శుభమన్ గిల్ గాయపడ్డాడు. ఆ వివరాలు.

టీమ్​ఇండియాకు బిగ్ షాక్​ - రెండో టెస్టులో సెంచరీ హీరోకు గాయం
టీమ్​ఇండియాకు బిగ్ షాక్​ - రెండో టెస్టులో సెంచరీ హీరోకు గాయం
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2024, 12:06 PM IST

Updated : Feb 5, 2024, 1:10 PM IST

IND VS ENG Gill Injured : ఇప్పటికే సతమతమవుతున్న టీమ్ ​ఇండియాకు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. గాయాలతో కేఎల్​ రాహుల్‌, రవీంద్ర జడేజా జట్టుకు దూరమవ్వగా ఇప్పుడు అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న స్టార్‌ శుభ్‌మన్‌ గిల్‌ గాయపడ్డాడు. ఇంగ్లాండ్​తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆటలో గిల్‌ కుడి చూపుడు వేలికి గాయమైనట్లు తెలిసింది. ఓ వైపు చేతి వేలి నొప్పితో బాధపడుతూనే అతడు సెకండ్‌ ఇన్నింగ్స్‌లో సెంచరీతో సత్తా చాటాడు. అయితే ఇప్పుడా నొప్పి ఎక్కువ అవ్వడంతో నాలుగో రోజు ఫీల్డింగ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్‌ వేదికగా ట్వీట్ చేసింది. "రెండో రోజు ఫీల్డింగ్‌లో శుబ్‌మన్‌ చేతి వేలికి గాయమైంది. అతడు నాలుగో రోజు ఫీల్డింగ్‌కు దూరంగా ఉండనున్నాటు" అని రాసుకొచ్చింది. అతడి స్థానంలో సర్ఫరాజ్‌ ఖాన్‌ సబ్‌స్ట్యూట్‌గా ఫీల్డింగ్‌కు దిగాడు. కాగా, ఈ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో అతడు 104 పరుగులు చేశాడు. అతడికిది కెరీర్‌లో మూడో టెస్టు శతకం. తన మూడో టెస్టు సెంచరీని అందుకోవడానికి గిల్​కు 12 ఇన్నింగ్స్‌ల సమయం పట్టింది.

మళ్లీ అడుగు ఎప్పుడు పెడతాడో : అయితే గాయపడిన గిల్ మళ్లీ మైదానంలోకి ఎప్పుడు అడుగుపెడతాడో ప్రస్తుతానికి చెప్పలేం. గాయంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అసలే అతడు గత కొంతకాలంగా పేలవ ఫామ్​తో కొనసాగుతున్నాడు. మరీ ముఖ్యంగా మూడో స్థానంలో బ్యాటింగ్​కు దిగి దారుణ ప్రదర్శన చేస్తున్నాడు. చివరి 10 ఇన్నింగ్స్​లో ఒక్కసారి కూడా కనీసం హాఫ్​ సెంచరీ మార్క్​ను టచ్​ చేయలేకపోయాడు. కానీ ఇప్పుడు వైజాగ్ టెస్టులో మాత్రం సెంచరీతో(IND VS ENG Gill Century) సత్తా చాటాడు. 147 బంతుల్లో 104 పరుగులు చేసి తనపై విమర్శకులకు చెక్​ పెట్టాడు. అతడి శతకంతోనే ఇంగ్లాండ్ ముందు టీమ్​ ఇండియా 399 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కానీ అంతలోనే ఇప్పుడు అతడు గాయపడటం ఆందోళను కలిగిస్తోంది. ఇకపోతే నాలుగో రోజు లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ తడబడుతూ ఆడుతోంది.

రచిన్ రవీంద్ర - డబుల్​ సెంచరీతో విధ్వంసం

60ఏళ్ల తర్వాత తొలిసారి - పాకిస్థాన్​పై భారత్ విజయం

Last Updated : Feb 5, 2024, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.