ETV Bharat / sports

అదే మా బలం - వారికి కెప్టెన్ రోహిత్ శర్మ గట్టి కౌంటర్​ - ind vs eng fourth test

IND vs ENG Rohith Sharma : టీమ్​ఇండియా గెలిచినప్పుడల్లా పిచ్​ల గురించి ప్రస్తావన వస్తుంటుంది. అయితే తమపై విమర్శల చేసిన వారికి కెప్టెన్ రోహిత్ శర్మ కౌంటర్ ఇచ్చాడు.

అదే మా బలం - వారికి కెప్టెన్ రోహిత్ శర్మ గట్టి కౌంటర్​

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 2:10 PM IST

Updated : Feb 19, 2024, 2:18 PM IST

IND vs ENG Rohith Sharma : టీమ్​ ఇండియా ఎలాంటి పిచ్‌లపైనైనా విజయం సాధించగలదని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. రాజ్‌ కోట్‌ టెస్టులో ఇంగ్లాండ్‌ను 434 పరుగుల భారీ తేడాతో టీమ్‌ఇండియా ఓడించింది. అయితే నాలుగో రోజు మూడో సెషన్‌లో బంతి విపరీతంగా టర్న్ అయింది. దీంతో భారత స్పిన్నర్లు చెలరేగి ఆడారు. రవీంద్ర జడేజా 5, కుల్‌దీప్‌ 2, అశ్విన్‌ ఓ వికెట్ పడగొట్టారు. పేసర్‌ బుమ్రా కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్ తీశాడు. దీంతో టీమ్​ఇండియా టర్నింగ్‌ పిచ్‌ల సాయంతో విజయాలు సాధిస్తోందని విమర్శలు వినిపించాయి. ఇప్పుడు వాటిని హిట్ మ్యాన్ కొట్టిపారేశాడు. అలాంటి వారికి తిరిగి కౌంటర్ ఇచ్చాడు.

ఇలాంటి పిచ్‌లపై మేం గతంలోనూ చాలా మ్యాచులే విజయం సాధించాం. టర్నింగ్‌ ట్రాక్‌లపై బాగా తిరిగే బంతిని ఎదుర్కోవడంతో పాటు మిగతా పిచ్‌లపైనా(పేస్‌) ఆడటం మాకున్న బలం. భవిష్యత్తుల్లోనూ అద్భుత ఫలితాలను అందుకుంటాం. ఇలాంటి పిచ్‌లనే తయారు చేయండి అంటూ మేం ఎవరికీ చెప్పము. అసలు దాని గురించి కూడా మాట్లాడము. ఎప్పుడైనా మ్యాచ్‌కు రెండు రోజుల ముందే సదరు స్టేడియానికి కు వెళ్తాం. అంత తక్కువ వ్యవధిలో మేం చేసేదేముంటుంది? పిచ్‌ను ఎలా తయారు చేయాలనేది క్యురేటరే డెసిషన్ తీసుకుంటాడు. ఎలాంటి మైదానంలోనైనా గెలవగల సత్తా టీమ్ ఇండియాకు ఉంది. దక్షిణాఫ్రికా కేప్‌టౌన్‌లో మేం విజయం సాధించిన విషయం, అక్కడి పిచ్‌ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే.

మొత్తంగా ఇంగ్లాండ్‌తో జరిగిన గత మూడు టెస్టుల్లోనూ భిన్న సవాళ్లను ఎదుర్కొన్నాం. హైదరాబాద్‌లో పిచ్‌ మందకొడిగా ఉంటుంది. స్పిన్‌ అయినప్పటికీ బంతి చాలా స్లోగా టర్న్ అవుతుంది. వైజాగ్‌లోనూ మ్యాచ్‌ జరిగే కొద్దీ పిచ్‌ నెమ్మదిగా అయిపోయింది. రాజ్‌కోట్‌లో నాలుగో రోజు మాత్రం బంతి ఫుల్ టర్న్‌ అయింది. భారత్‌లో ఇలాంటి పరిస్థితులు ఎదురౌవ్వడం మాములే. విదేశీ గడ్డపై ఇలాంటి పిచ్‌లు ఉంటే అక్కడా కూడా ఇలాంటి గొప్ప ప్రదర్శనే చేస్తాం. మూడో టెస్టులో మా ప్లేయర్స్​ చాలా బాగా ఆడారు. అని రోహిత్ అన్నాడు.

ఇంగ్లాండ్​తో నాలుగో టెస్ట్​ - టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ దూరం!

ఒకే ఓవర్లో 6 సిక్స్​లు - ఫాస్టెస్ట్​​ సెంచరీతో ఆంధ్ర బ్యాటర్ విధ్వంసం

Last Updated : Feb 19, 2024, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.