ETV Bharat / sports

క్రాలే LBW కాంట్రవర్సీ- టెక్నాలజీదే లోపమన్న స్టోక్స్- రవిశాస్త్రి స్ట్రాంగ్ రిప్లై! - Ind Wtc Points 2025

Ind vs Eng LBW Controversy: భారత్- ఇంగ్లాండ్ రెండో టెస్టులో జాక్ క్రాలీ ఎల్​బీడబ్ల్యూ విషయం కాంట్రవర్సీగా మారింది. టెక్నాలజీ పూర్తిగా తప్పుగా ఉందని ఆరోపించిన స్టోక్స్​కు రవిశాస్త్రి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు.

Ind vs Eng LBW Controversy
Ind vs Eng LBW Controversy
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2024, 8:53 PM IST

Ind vs Eng LBW Controversy: విశాఖపట్టణం వేదికగా జరిగిన భారత్- ఇంగ్లాండ్ టెస్టులో ఓ విషయంపై వివాదం చెలరేగింది. ఇంగ్లాండ్ బ్యాటర్ జాక్ క్రాలీ ఎల్​బీడబ్ల్యూ ఔట్ కాంట్రవర్సీగా మారింది. మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్​ స్టోక్స్ ప్రెస్ కాన్ఫరెన్స్​ సమయంలో ఈ విషయంపై స్పందించాడు. జాక్ క్రాలీ ఔట్​పై అసహనం వ్యక్తం చేస్తూ, కెమెరా యాంగిల్స్​ (Hawkeye Technology) టెక్నాలజీ తప్పుగా ఉందని ఆరోపించాడు. దీనిపై టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. స్టోక్స్​కు స్ట్రాంగ్​ రిప్లై ఇచ్చాడు.

కెమెరా యాంగిల్స్​ గురించి తెలుసుకోవాలంటూ స్టోక్స్​కు ఇన్​డైరెక్ట్​గా సలహా ఇచ్చాడు. క్రాలీ ఔట్ విషయంలో కెమెరా టెక్నాలజీ, థర్డ్ అంపైర్ నిర్ణయం సరైనవేనని బదులిచ్చాడు.'మనం టీవీలో చూసే స్ట్రయిట్ కెమెరా వ్యూ ఎగ్జాక్ట్​గా ఉండదు. హాక్- ఐ కెమెరా (Hawkeye Camera) స్టంప్స్​కు సరిగ్గా స్ట్రయిట్ లైన్​లో ఉంచుతారు. అక్కడ రెండు స్టంప్స్​ కనిపించాయి. ఒకవేళ ఎక్స్​ ట్రా కవర్స్ వైపు కెమెరా ఉంచినట్లైతే మూడు స్టంప్స్​ కనిపిస్తాయి. కెమెరా యాంగిల్స్ అనేవి ఎల్​బీడబ్ల్యూ నిర్ణయంపై ప్రభావం చూపవు. ఏదైనా మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. అంతేకాని టెక్నాలజీ తప్పు ఉండదు. బ్రాడ్​కాస్టింగ్​పై అవగాహన ఉన్న వాళ్లకు ఈ టెక్నాలజీ గురించి తెలిసే ఉంటుంది' అని శాస్త్రి రిప్లై ఇచ్చాడు.

అసలేం జరిగిందంటే? నాలుగోరోజు తొలి సెషన్​లో ఇంగ్లాండ్ బ్యాటర్ జాక్ క్రాలీ క్రీజులో ఉన్నాడు. కుల్​దీప్ యాదవ్ బౌలింగ్​లో ఓ బంతి నేరుగా క్రాలీ ప్యాడ్స్​ను తగిలింది. దీంతో టీమ్ఇండియా ప్లేయర్లు ఎల్​బీడబ్ల్యూకి అప్పీల్ చేశారు. అంపైర్ నాటౌట్​గా ప్రకటించాడు. అయితే భారత్ రివ్యూ కోరింది. ఇక రిప్లైలో బాల్ ట్రాకింగ్​ లెగ్ స్టంప్​ను తాకుతున్నట్లు లేదు. ఒకవేళ అంపైర్స్ కాల్​గా ఫలితం వస్తుందనుకున్నారంతా. కానీ, హాక్- ఐ టెక్నాలజీలో బంతి స్టంప్స్​ను తాకుతున్నట్లు తేలింది. దీంతో క్రాలీని థర్డ్ అంపైర్ ఔట్​గా ప్రకటించాడు. ఇక థర్డ్ అంపైర్ నిర్ణయం పట్ల ఇంగ్లాండ్ ప్లేయర్లంతా షాక్​కు గురయ్యారు.

విశాఖ టెస్టులో భారత్ విజయం- 1-1తో సిరీస్ సమం

ఇంగ్లాండ్​ సిరీస్​తో ఇషాన్ రీ ఎంట్రీ- హింట్ ఇచ్చిన ద్రవిడ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.