ETV Bharat / sports

టీమ్ఇండియా జోరు కొనసాగేనా- ఆఖరి టెస్టులో పైచేయి ఎవరిదో - Ashwin 100th test

Ind vs Eng 5th Test 2024: భారత్‌- ఇంగ్లాండ్‌ మధ్య చివరిదైన ఐదోటెస్టు గురువారం ధర్మశాల వేదికగా ప్రారంభంకానుంది. ఇప్పటికే 3-1తో టెస్టు సిరీస్‌ సొంతం చేసుకున్న టీమ్ఇండియా చివరి మ్యాచ్‌లో కూడా నెగ్గి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవాలని భావిస్తోంది. టీమ్ఇండియా వెటరన్ స్పిన్నర్‌ అశ్విన్‌, ఇంగ్లాండ్‌ స్టార్ బ్యాటర్‌ బెయిర్‌స్టోలకు ఇది వందో టెస్టు కావడం వల్ల అందరి దృష్టి వీరిపైనే ఉండనుంది.

EInd vs Eng 5th Test 2024 Match Preview
Ind vs Eng 5th Test 2024 Match Preview
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 7, 2024, 6:36 AM IST

Updated : Mar 7, 2024, 7:57 AM IST

Ind vs Eng 5th Test 2024: ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టెస్టు సిరీస్‌లో దూకుడు మీదున్న ఉన్న టీమ్ఇండియా ఆఖరి మ్యాచ్​లోనూ అదే జోరు కొనసాగించాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్‌ చివరి టెస్టులోనూ విజయం సాధించి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవాలని భావిస్తోంది. ఈ టెస్టు మ్యాచ్‌లో ఓడిపోతే WTC పాయింట్ల పట్టికలో భారత్‌ అగ్రస్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ధర్మశాల పిచ్‌ మొదట సీమర్లకు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్‌ సాగే కొద్ది స్పిన్నర్ల ప్రభావం కనిపిస్తుంది.

ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి వందో టెస్టు ఆడుతున్న వెటరన్‌ స్పిన్నర్‌ ఆర్‌. అశ్విన్‌పై నెలకొంది. దశాబ్దకాలంగా జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న అశ్విన్‌ కెరీర్‌లో మైలురాయి అయిన వందో టెస్టులో రాణించాలని పట్టుదలగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో అదరగొడుతున్న జైస్వాల్‌తో ఎప్పటిలాగే రోహిత్‌ ఓపెనింగ్‌ చేస్తాడు. శుభమన్‌ గిల్‌, సర్ఫారాజ‌్ ఖాన్‌ తుది జట్టులో ఉండనున్నారు. ఈ సిరీస్‌లో దారుణంగా విఫలమైన రజత్‌ పటీదార్‌ స్థానంలో మరో యువ ఆటగాడు దేవదత్‌ పడిక్కల్‌ టెస్టు అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా నాలుగో టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ధ్రువ్‌ జురెల్‌ మరోసారి చెలరేగాలని చూస్తున్నాడు. అశ్విన్‌, జడేజా ఆల్‌రౌండర్‌లుగా జట్టులో ఉండనున్నారు. నాలుగో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న స్టార్‌ పేసర్‌ బుమ్రా తిరిగి జట్టులోకి రానున్నాడు. బుమ్రాను తుది జట్టులోకి తీసుకుంటే సిరాజ్‌ లేదా ఆకాశ్‌ దీప్‌లలో ఎవరిని పక్కనపెడతారో చూడాలి. ధర్మశాల పిచ్‌ పరిస్థితులను బట్టి ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగితే కులీదీప్‌ యాదవ్‌ బెంచ్‌కు పరిమితంకానున్నాడు.

మరోవైపు బజ్‌బాల్‌ ఆటతీరులో ఇంటాబయట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఇంగ్లాండ్‌ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే తుది జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్‌ ఓలీ రాబిన్‌సన్‌ స్థానంలో స్పీడ్‌ స్టార్‌ మార్క్‌వుడ్‌ను తీసుకుంది. ఓపెనర్లు జాక్‌ క్రాలీ, బెన్‌ డకెట్‌ మినహా ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు.

ముఖ్యంగా వందో టెస్టు ఆడుతున్న జానీ బెయిర్‌ స్టో దారుణంగా ఫెయిల్‌ అయ్యాడు. జట్టులో స్థానాన్ని కోల్పోయే ప్రమాదంలో పడిన బెయిర్‌స్టో శతక టెస్టులో రాణించాల్సిన అవసరం ఉంది. వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ టెస్టుల్లో 700 వికెట్ల క్లబ్‌కు రెండు వికెట్లు దూరంలో ఉండడంతో ఈ మ్యాచ్‌లో ఆ ఘనత సాధించాలని చూస్తున్నాడు. యువ స్పిన్నర్లు టామ్‌ హార్ట్‌లీ, బషీర్‌ మరోసారి రాణిస్తే ఇంగ్లాండ్​కు కలిసొచ్చే ఛాన్స్ ఉంది.

'అప్పట్లో ఒకడుండేవాడు'- డకెట్ కామెంట్స్​కు రోహిత్​ స్ట్రాంగ్ రిప్లై

100వ టెస్ట్ : అశ్విన్‌ మ్యాజికా - బెయిర్‌ స్టో షోనా

Last Updated : Mar 7, 2024, 7:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.