ETV Bharat / sports

భారత్​ x ఇంగ్లాండ్​ రె'ఢీ' - రెండో టెస్ట్ వేదికపై టీమ్ఇండియా రికార్డులు ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 7:34 AM IST

IND vs ENG 2nd Test : హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఓటమిని చవి చూసిన రోహిత్​ సేన ఇప్పుడు తదుపరి మ్యాచుల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంది. అయితే రెండో టెస్టు వేదికైన విశాఖపట్నంలో టీమ్ఇండియా ఇప్పుటి వరకు ఎటువంటి రికార్డులు నమోదు చేసిందంటే ?

IND vs ENG 2nd Test
IND vs ENG 2nd Test

IND vs ENG 2nd Test : భారత్, ఇంగ్లాండ్​ జట్లు మరో టెస్ట్​ పోరుకు రెడీగా ఉన్నాయి. ఇటీవలే హైదరాబాద్​లో ఆడిన ఈ జంట రెండో టెస్టు మ్యాచ్​ కోసం విశాఖపట్నానికి పయనమవ్వనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఓటమిని చవిచూసిన భారత జట్టుకు ఈ మ్యాచ్ మరింత కీలకం కానుంది. దీంతో రెండో టెస్టులో తమ సత్తా చాటేందుకు రోహిత్​ సేన తీవ్ర కసరత్తులు చేస్తోంది. గత మ్యాచ్​లో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ గెలుపు కోసం కొత్త వ్యూహాలను రచిస్తోంది. అయితే విశాఖ వేదికపై భారత్​ ఇప్పటి వరకు ఎన్నో రికార్డులు నమోదు చేసింది. ఇంతకీ అవేంటంటే ?

2016లో వైజాగ్ వేదికగా ఇంగ్లాండ్​తో టీమ్ఇండియా తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. ఇందులో భారత జట్టు 246 పరుగుల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పుజారాలు ఈ మ్యాచ్​లో సెంచరీలతో జట్టుకు కీలక ఇన్నింగ్స్ ఇచ్చారు. ఆ తర్వాత 2019లో సౌతాఫ్రికాతో భారత్ ఇదే వేదికగా రెండో మ్యాచ్ ఆడింది. ఇందులోనూ టీమ్ఇండియా 203 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఇలా ఆడిన రెండు మ్యాచుల్లోనూ రికార్డు స్థాయిలో స్కోర్​ సాధించి గెలుపును తమ ఖాతాలో వేసుకుంది. అయితే తాజాగా జరిగిన మ్యాచ్​ టీమ్ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా చేసింది.

తొలి టెస్టులో తొలి రెండు రోజుల్లో మంచి స్కోర్ సాధించి లీడ్​లో ఉన్న రోహిత్​ సేన, మూడో రోజు మాత్రం డీలా పడిపోయింది. ఇంగ్లాండ్ ప్లేయర్ ఓలీ పోప్ శతకంతో భారత బౌలర్లను షాక్​కు గురి చేశాడు. అయినప్పటికీ భారత జట్టు కట్టుదిట్టంగా బాల్స్​ వేస్తూ వచ్చింది. కానీ ఇంగ్లీష్​ జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించడంలో విఫలమైంది. దీంతో ఓటమిని చవి చూసింది.

మరోవైపు తొలి టెస్టుకు ముందు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న భారత్ ఇప్పటి ఓటమితో ఏకంగా ఐదవ స్థానానికి చేరుకుంది. దీంతో రానున్న రెండో టెస్టులో విజయం సాధిస్తేనే పాయింట్ల పట్టికలో మరోసారి టీమ్​ఇండియా తమ రెండవ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చని విశ్లేషకుల మాట. చూడాలి ఈ రెండవ టెస్ట్​లో టీమ్ఇండియా ఆటతీరు ఎలా ఉండనుందో.

రెండో టెస్టుకు జడేజా, కేఎల్‌ రాహుల్‌ దూరం

సర్ఫరాజ్‌ వచ్చేశాడు - అతడి స్పెషాలిటీ ఏంటంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.