ETV Bharat / sports

ఉప్పల్‌ టెస్ట్ : స్పిన్నర్ల మ్యాజిక్​ - దంచికొట్టిన జైశ్వాల్​ - యశస్వి జైస్వాల్​ ఇంగ్లాండ్ టెస్ట్

Ind Vs Eng 2024 Test Series : టీమ్​ఇండియా - ఇంగ్లాండ్​ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్​లో భాగంగా తొలి రోజు ఆట ముగిసింది. గేమ్​ ముగిసే సమయానికి ఇండియా 23 ఓవర్లు ఆడి తొలి వికెట్​కు 119 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్​(70 బంతుల్లో 76 ; 9x4, 3x6) దూకుడు ఆడాడు. శుభమన్ గిల్​(14) క్రీజులో ఉన్నాడు. రోహిత్ శర్మ(27 బంతుల్లో 24; 3x4) ఔట్ అయ్యాడు. అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్​లో 246 చేసి ఆలౌట్ అయింది.

ఉప్పల్‌ టెస్ట్ : ముగిసిన తొలి రోజు ఆట
ఉప్పల్‌ టెస్ట్ : ముగిసిన తొలి రోజు ఆట
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2024, 4:49 PM IST

Updated : Jan 25, 2024, 6:14 PM IST

Ind Vs Eng 2024 Test Series : టీమ్​ఇండియా - ఇంగ్లాండ్​ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్​లో భాగంగా తొలి రోజు ఆట ముగిసింది. గేమ్​ ముగిసే సమయానికి ఇండియా 23 ఓవర్లు ఆడి తొలి వికెట్​కు 119 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్​(70 బంతుల్లో 76 ; 9x4, 3x6) దూకుడు ఆడాడు. శుభమన్ గిల్​(14) క్రీజులో ఉన్నాడు. రోహిత్ శర్మ(27 బంతుల్లో 24; 3x4) ఔట్ అయ్యాడు. రోహిత్‌ను జాక్‌ లీచ్‌ ఔట్ చేశాడు. అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్​లో 246 చేసి ఆలౌట్ అయింది. కాగా, తొలి బంతి నుంచే యశస్వి దూకుడుగా బ్యాటింగ్‌ చేశాడు. అతడిని కట్టడి చేయడం ఇంగ్లాండ్‌ బౌలర్లకు కష్టామైంది. భారత్‌ ఇంకా 127 పరుగులు మాత్రమే వెనకపడి ఉంది. ఇకపోతే ఇప్పటికే ఇంగ్లాండ్‌ మూడు డీఆర్‌ఎస్‌లను వినియోగించుకోవడం గమనార్హం. అవన్నీ వృథా కావడం వల్ల ఆ జట్టు ఆటగాళ్లు నిరాశకు గురయ్యారు.

రోహిత్‌ అంత తొందర ఎందుకు? : రోహిత్‌‌ శర్మ బ్యాటింగ్‌ తీరును కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్​ తప్పుపడుతున్నారు. స్కోర్‌ బోర్డు బాగానే ఉన్నప్పటికీ భారీ షాట్‌ ప్రయత్నించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఇదేమి వైట్‌ బాల్‌ క్రికెట్‌ కాదు కాదా, అంత తొందర ఎందుకుని నెట్టింట్లో కామెంట్లు చేస్తున్నారు.

రోహిత్ మొదటి వికెట్‌కు జైశ్వాల్‌తో కలిపి 80 పరుగుల భాగస్వామ్యం నెల​కొల్పాడు. ఈ భాగస్వామ్యం తొలి 12 ఓవర్లలోనే నమోదు కావడం గమనార్హం. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి టీమ్​ఇండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 103 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్​( 76), శుభమన్ గిల్​(14) క్రీజులో కొనసాగుతున్నారు.

టీ20లా ఆడేసిన యశస్వి : ఇంగ్లాండ్‌ వంటి కఠినమైన ప్రత్యర్థిపై తన టీ20 ఫార్ములాతో 'బజ్‌బాల్' క్రికెట్‌కు సవాల్‌ విసిరాడు యశస్వి. మొదటి రెండు ఓవర్లలో ఒక్క బంతిని కూడా కెప్టెన్‌ రోహిత్ శర్మ ఎదుర్కోనీయకుండా యశస్వినే ఆడాడు. రెండో ఓవర్‌లోనే రెండు సిక్స్‌లు బాది - అదే దూకుడు ఆట ముగిసేసవరకూ కొనసాగింంచాడు. అలా జట్టు స్కోరు 80కి వెళ్లగా అందులో యశస్వివే 53 పరుగులు కావడం విశేషం. రోహిత్ అవుట్​ అయిన తర్వాత కఠినమైన బంతులను వదిలేస్తూనే అడపాదడపా బౌండరీలతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. రెండో రోజు తొలి సెషన్‌లో ఇంకాసేపు క్రీజ్‌లో ఉంటే అతడికి సెంచరీ బాదడం పెద్ద కష్టమేం ఏమీ కాదు.

స్పిన్నర్లే హీరోలు : హైదరాబాద్ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం అని పేరు ఉంటుంది. రెండో రోజు లేదా మూడో రోజు నుంచి స్పిన్‌కు అనుకూలంగా మారుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈరోజు తొలి సెషన్‌ నుంచే స్పిన్నర్ల మంచి ప్రభావం చూపించారు. అశ్విన్‌ (3/68), జడేజా (3/88), అక్షర్ పటేల్ (2/33) కలిపి ఎనిమిది వికెట్లు తీశాడు.

కింగ్ కోహ్లి ఖాతాలో మరో ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు

మ్యాచ్‌ మధ్యలో రోహిత్ కాళ్లు మొక్కిన కోహ్లీ అభిమాని!

Last Updated : Jan 25, 2024, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.