IND vs BAN Warm Up Match 2024 : 2024 టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక వార్మప్ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 60 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది. రిషభ్ పంత్ (53 రిటైర్డ్ ఔట్), రాణించాడు. ఇక 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్, 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులే చేయగలిగింది. భారత బౌలర్ల ధాటికి బంగ్లా ఓటమి చవిచూడక తప్పలేదు. ఏడో స్థానంలో వచ్చిన బ్యాటింగ్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లా (40 రిటైర్డ్ హర్ట్); టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
సంజూ ఓపెనర్‌గా
అంతకుముందు కెప్టెన్ రోహిత్ శర్మ (23)తో కలిసి ఓపెనింగ్ చేసిన సంజు శాంసన్ ఒక్క పరుగు మాత్రమే తీసి నిరాశపర్చాడు. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండగా, రిషభ్ పంత్ మాత్రం వన్‌డౌన్‌లో వచ్చి అర్ధ శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ (31) జట్టుకు మెరుగైన స్కోర్ అందించగా, చివర్లో బరిలోకి దిగిన హార్దిక్ పాండ్య (40*); దూకుడుగా ఆడాడు. యంగ్ ప్లేయర్ శివమ్ దూబె కూడా (14) ఫర్వాలేదనిపించాడు.
ఇదిలా ఉండగా, బంగ్లా బౌలర్లలో మెహది హసన్, షోరిఫుల్ ఇస్లామ్, మహ్మదుల్లా, తన్వీర్ ఇస్లామ్ తలో వికెట్ దక్కించుకున్నారు. గ్రూప్-ఏలో ఉన్న భారత్ జూన్ 5న కెనడాతో తొలి మ్యాచ్‌లో తలపడనుంది.
పాండ్య అదుర్స్
ఐపీఎల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్య వార్మప్ మ్యాచ్‌లో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో 23 బంతుల్లోనే 40* పరుగులు చేశాడు. అందులో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉండడం విశేషం. 17 ఓవర్ తన్వీర్ ఇస్లామ్ బౌలింగ్‌లో పాండ్య వరుసగా మూడు సిక్స్ (6 6 6)లు బాది ఔరా అనిపించాడు. శివమ్ దూబే (14) ఆకట్టుకోలేకపోయాడు. ఇక బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్, ఇస్లామ్, మహ్మదుల్లా, తన్వీర్ ఇస్లామ్ తలో వికెట్ పడగొట్టారు.
'హార్దిక్, దూబే రోల్స్ వేరు- ఎవరి పాత్ర వారిదే' - T20 World Cup
టీ20 వరల్డ్ కప్ లైవ్‌లో చూడాలా? టైమింగ్స్ తెలుసా? అసలే USలో మ్యాచులు కదా! - T20 World Cup 2024