IND VS BAN Second Test Third Spinner : బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్ ఇండియా మొదట్లో కష్టపడినా ఆ తర్వాత అలవోకగానే చేజిక్కించుకుంది. సంప్రదాయంగా స్పిన్నర్ల ఆధిపత్యం చెలాయించే చెపాక్ పిచ్, ఈసారి పేసర్లకు అనుకూలించినప్పటికీ పరిస్థితులను తమకు తగ్గట్లు మార్చుకున్న భారత జట్టు ప్రత్యర్థి జట్టును ఓడించింది. ఇక ఇప్పుడు కాన్పూర్ వేదికగా జరగనున్న రెండో టెస్ట్ కోసం సిద్ధమవుతోంది. ఇందులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది.
అయితే చెపాక్ పిచ్‌ను అంచనా వేసి ఒక స్పిన్నర్ లేకుండా మూడో పేసర్‌తో బరిలోకి దిగిన భారత్ మంచి ఫలితాన్ని అందుకుంది. కానీ కాన్పూర్ పిచ్‌లో మార్పులు ఉండే అవకాశాలు లేవు. కాబట్టి ఎప్పటిలాగానే స్పిన్నర్లకు సహకారం ఉంటుంది. దీంతో ఒక పేసర్‌ను తగ్గించి ఎప్పటి లాగే ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల కూర్పుతో భారత్ బరిలోకి దిగుతుంది.
Kuldeep Yadav Recent Test Stats : మరి రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు తోడుగా మూడో స్పిన్నర్‌గా ఎవరిని బరిలోకి దింపుతుందని ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఈ స్థానానికి అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్ పోటీ పడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఫామ్ ప్రకారం చూస్తే కుల్‌దీప్‌కు ఛాన్స్ దక్కాలి. ఎందుకంటే సంవత్సరం నుంచి వివిధ ఫార్మాట్లలో నిలకడగా ఆడుతున్నాడు కుల్‌దీప్. ఈ ఏడాది ఆరంభంలోనూ ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు టెస్టు మ్యాచుల సిరీస్‌లో 20.15 సగటుతో 19 వికెట్లు తీశాడు. ఎలాంటి పిచ్ మీదైనా బంతిని బాగా తిప్పేయగలడు. స్పిన్‌కు సహకరిస్తే మరింతగా చెలరేగి ఆడుతాడు.
Axar Patel Recent Test Stats అయితే కుల్‌దీప్ ఓ మోస్తరుగా మాత్రమే బ్యాటింగ్ చేయగలడు. ఇతడితో పోలిస్తే అక్షర్ బ్యాటింగ్‌లో మరింత మెరుగ్గా ఆడతాడు. కానీ ఎలాగో భారత్‌కు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి అక్షర్ మీద ఆధార పడాల్సిన అవసరం ఉండదు. పైగా కాన్పూర్ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలమే. అక్షర్ లాగే లెఫ్ట్ హ్యాండ్‌తో బౌలింగ్ చేసే జడేజా జట్టులో ఉన్నాడు కాబట్టి అలాంటి బౌలర్ మరొకరిని తుది జట్టులోకి తీసుకోవడం కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే అలా చేస్తే బౌలింగ్‌లో వైవిధ్యం కనపడదు. టెస్టుల్లో అక్షర్ ఫామ్ కూడా ఈ మధ్య అంత గొప్పగా ఏమీ లేదు. చివరగా అతడు ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి 5 వికెట్లు మాత్రమే తీశాడు.
కాబట్టి ప్రస్తుతం జరగబోయే రెండో టెస్‌కు కుల్‌దీప్‌కే జట్టు యాజమాన్యం మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు బంగ్లాదేశ్ పేసర్ నహిద్ రాణా స్థానంలోకి తైజుల్ ఇస్లామ్‌ను ఎంపిక చేస్తుందని సమాచారం.
మెగా వేలంలోకి 5 స్టార్ ప్లేయర్స్! - ఏ ఫ్రాంఛైజీ ఎవరిని వదులుకుంటుందంటే? - IPL 2025 Mega Auction