ETV Bharat / sports

'నాకు రెండు చేతులే ఉన్నాయి సార్​' - హోటల్​ సిబ్బందితో కోహ్లీ బ్యాడ్​ బిహేవియర్​! - Virat Kohli Behaviour - VIRAT KOHLI BEHAVIOUR

IND VS BAN Second Test Virat Kohli : బంగ్లాతో రెండో టెస్ట్​ కోసం కాన్పూర్ వెళ్లిన టీమ్​ఇండియాకు గ్రాండ్ వెలకమ్ ఇచ్చారు అక్కడి హోటల్ నిర్వాహకులు. అయితే అక్కడ విరాట్ కోహ్లీ ఓ హోటల్ సిబ్బందితో ప్రవర్తించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. దీంతో నెటిజన్లు కోహ్లీపై విమర్శలు చేస్తున్నారు.

source ETV Bharat
IND VS BAN Second Test Virat Kohli (source ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 25, 2024, 11:35 AM IST

IND VS BAN Second Test Virat Kohli : టీమ్ ​ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత దశాబ్దన్నర కాలం నుంచి క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్నాడు. హేమాహేమీలకు సైతం సాధ్యం కాని గొప్ప రికార్డులను నెలకొల్పాడు. ఇదే సమయంలో క్రీడా ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడాకారుడిగానూ నిలిచాడు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం కోహ్లీ ఓ అభిమానితో చేసిన సంభాషణ, ప్రవర్తించిన తీరు వైరల్​గా మారింది!

ఇంతకీ ఏం జరిగిందంటే? - ప్రస్తుతం టీమ్​ఇండియా బంగ్లాదేశ్​తో టెస్ట్​ సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్​లో గెలిచిన భారత జట్టు రెండో మ్యాచ్​ కోసం సిద్ధమవుతోంది. రెండో పోరు కాన్పూర్ గ్రీన్ పార్క్​ స్టేడియం వేదికగా జరుగనుంది. ఇందుకోసం తాజాగా భారత జట్టు కన్పూర్​కు చేరుకుంది. అక్కడే ఉన్న ల్యాండ్ మార్క్​ హోట్​లోనే బస చేయనుంది. అయితే హోటల్​కు చేరుకున్న టీమ్​ఇండియాకు హోటల్​ నిర్వాహకులు గ్రాండ్ వెలకమ్ తెలిపారు. బొకేలు ఇచ్చి వారిని ఆహ్వానించారు.

ఈ క్రమంలోనే కోహ్లీకి ఓ హోటల్​ సిబ్బంది బొకే ఇచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వగా, మరో సిబ్బంది కూడా విరాట్​కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే విరాట్​ రెండు చేతుల్లోనూ బొకే, బ్యాగ్ ఉండడంతో కరచాలనం చేయలేకపోయాడు. 'నాకు రెండు చేతులే ఉన్నాయి' అంటూ సైటిరికల్​ కామెంట్​ చేశాడు. కామెంట్​ చేసేటప్పుడు విరాట్ ఫేస్ ఎక్స్​ప్రెషన్ కూడా కాస్త మరోలా కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియో చూసిన పలువురు కోహ్లీ యాటిట్యూడ్​పై విమర్శలు గుప్పిస్తున్నారు. 'డిస్​రెస్పెక్ట్​ఫుల్​ యాటిట్యూడ్'​, 'అనవసరమైన డైలాగ్​లు వేస్తున్నాడు', 'బ్యాడ్ యాటిట్యూడ్​ కోహ్లీ', 'నీ ఫేస్ ఎక్స్​ప్రెషన్​ కూడా ఏం బాలేదు', 'రిటైర్​ అయ్యే సమయంలో ఎందకింత గర్వం' అంటూ రకరకాల నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక బంగ్లాతో జరిగిన తొలి టెస్ట్​లో కోహ్లీ ప్రదర్శన విషయానికొస్తే అతడు రాణించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్​లో 6 పరుగులు, రెండో ఇన్నింగ్స్​లో 17 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయితే ఈ పోరులో అశ్విన్​, పంత్, గిల్, జైశ్వాల్​ ప్రదర్శనతో 280 పరుగులు తేడాతో భారత్ విజయం సాధించింది.

కోహ్లీ, నీరజ్ చోప్రా - ఇప్పుడు భారత్‌లో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరంటే? - Most Popular Sports Person In India

రెండో టెస్ట్​కు బ్లాక్ సాయిల్ పిచ్​ - ఇక్కడ వికెట్​ ఎలా ఉంటుంది? ఎవరికి అనుకూలం? - India vs Bangladesh 2nd Test

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.