IND VS BAN First Test Rishabh Pant : నేడు సెప్టెంబర్ 19న భారత జట్టు కీలక మ్యాచ్‌కు భారత్ సిద్ధమవుతోంది. చెన్నైలో టీమ్ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మొదటి టెస్టు మొదలు కానుంది. స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్న రిషబ్ పంత్‌కు దాదాపు రెండేళ్ల తర్వాత టెస్ట్ ఆడే అవకాశం వచ్చింది. కార్ యాక్సిడెంట్ వల్ల అతడికి ఈ గ్యాప్ వచ్చింది. ఆ ప్రమాదం నుంచి బయటపడిన అతడు 2024 ఐపీఎల్‌కు ముందే తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు.
పంత్ చివరిసారిగా టెస్ట్ మ్యాచ్ ఆడి 632 రోజులు అవుతోంది. యాదృచ్ఛికంగా అతడి చివరి టెస్టు 2022లో బంగ్లాదేశ్‌తో జరిగింది. చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో గురువారం అదే జట్టుపై పునరాగమనం చేసే అవకాశం ఇప్పుడు వచ్చింది. పంత్ క్రికెట్‌కు దూరంగా ఉన్నప్పుడు పెద్దగా మార్పులు చోటు చేసుకోకపోయినా, కొంత మంది యంగ్ ప్లేయర్‌లు వెలుగులోకి వచ్చారు.
పంత్ లేనప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకున్న వికెట్ కీపర్ ధృవ్ జురెల్. ఇంగ్లాండ్‌తో ఇటీవల జరిగిన స్వదేశీ టెస్ట్ సిరీస్‌లో తన బ్యాటింగ్, వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో ఆకట్టుకున్నాడు. తాజాగా దులీప్ ట్రోఫీలోనూ మంచి ప్రదర్శనతో మార్కులు సంపాదించాడు. దీంతో జురెల్‌ను జట్టు మేనేజ్‌మెంట్ రాబోయే మ్యాచ్‌లో కొనసాగించాలని భావించవచ్చు. కాబట్టి పంత్ ఈ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది.
సిద్ధంగా ఉన్న పంత్ - గత ఐపీఎల్ తర్వాత పంత్, టీ20 ప్రపంచ కప్ ఆడాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో ఓ మ్యాచ్‌కు అవకాశం వచ్చింది. పొట్టి ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చినా, అతడి కోసం టెస్ట్ క్రికెట్ ఎదురు చూస్తోంది. టెస్ట్‌లకు స్కిల్స్ మాత్రమే కాదు, అపారమైన ఏకాగ్రత కూడా అవసరం. ఇటీవల దులీప్ ట్రోఫీలో ఇండియా బి తరఫున ఆడిన పంత్, తాను టెస్టులకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చాడు. పంత్ మొదటి ఇన్నింగ్స్‌లో 10 బంతుల్లో 7 పరుగులే చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 47 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్‌లతో 61 పరుగులు చేశాడు.
పంత్ గురించి గంభీర్ ఏమ్నాడంటే?
ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ "టెస్ట్ క్రికెట్‌లో బ్యాటర్‌గా పంత్ ఎంత విధ్వంసకరమో మనందరికీ తెలుసు. అతడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని జట్లపై మైదానాల్లో పరుగులు చేశాడు." అని చెప్పాడు.
పంత్ వికెట్ కీపింగ్ గురించి గంభీర్ మాట్లాడుతూ, " బ్యాటింగ్‌లోనే కాదు అతడు అతడు స్టంప్‌ల వెనుక, ముఖ్యంగా భారత పిచ్‌లపై అద్భుతంగా ప్రదర్శన చేశాడు. టెస్టుల్లో మంచిగా రాణించాడు. అశ్విన్, జడేజా, కుల్దీప్ వంటి బౌలర్లకు కీపింగ్ చేయడం అంత సులభం కాదు. కానీ పంత్ అద్భుతంగా రాణించాడు." అని అన్నాడు.
బంగ్లాతో తొలి టెస్ట్ - ప్రస్తుతం చెపాక్ పిచ్ ఎలా ఉందంటే? - IND VS BAN FIRST TEST PITCH