Ind Vs Aus Under 19 Final : అండర్ 19 ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు బరిలోకి దిగిన టీమ్ఇండియా యువ జట్టుకు నిరాశే మిగిలింది. ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ పోరులో భారత జట్టు ఓటమి పాలైంది. దీంతో 79 పరుగుల తేడాతో ఆసీస్ జట్టు గెలుపును సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా స్కోర్ 253/7, భారత్ మాత్రం 174 పరుగుకే ఆలౌటైంది. ఇక అండర్-19 వన్డే ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా నాలుగోసారి సాధించింది.
మ్యాచ్ సాగిందిలా :
254 పరుగులు లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన టీమ్ఇండియా ప్రారంభంలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న ఆర్షిన్ కులకర్ణి 3 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ముషీర్ ఖాన్(22) కూడా స్ట్రైక్ రొటేట్ చేయడం వల్ల ఇబ్బంది పడ్డాడు. దీంతో పవర్ ప్లే సమయానికి భారత జట్టు వికెట్ నష్టానికి 28 పరుగులే చేయగిలిగింది. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా ఆస్ట్రేలియా పేసర్లు వేస్తున్న బంతులకు భారత ప్లేయర్లు ఆచితూచి పరుగులు స్కోర్ చేశారు. అయితే ఆసీస్ బౌలర్ల ధాటికి బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో చివరి 10 ఓవర్లలో భారత్ 4 వికెట్లు చేజార్చుకుంది. స్వల్ప వ్యవధిలోనే మ్యాక్‌మిలన్ వేసిన బంతి బ్యాట్‌కు తగిలి వికెట్ కీపర్ చేతిలో పడటం వల్ల సచిన్ దాస్ (9) పెవిలియన్ బాట పట్టాడు. అండర్సన్ వేసిన బంతి (24.5)కి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ప్రియాన్షు మోలియా కూడా 9 పరుగులకే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ఆరవెల్లీ అవినాశ్ (0) డకౌటవ్వగా, 30.3 ఓవర్‌లో బార్డ్‌మాన్ వేసిన బంతికి నిలకడగా ఆడుతున్న ఓపెనర్ బ్యాటర్ ఆదర్శ్ సింగ్ (47) కూడా కీపర్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత రాజ్ లింబాని (0), మురుగన్ అభిషేక్ (42) కూడా ఔట్ కావడం వల్ల భారత్‌కు నిరాశ మిగిలింది.
Ind Vs Aus U 19 Final Squad :
ఆస్ట్రేలియా U19 (ప్లేయింగ్ XI): హ్యారీ డిక్సన్, సామ్ కొన్‌స్టాస్, హ్యూ వీబ్‌జెన్(కెప్టెన్), హర్జాస్ సింగ్, ర్యాన్ హిక్స్(కీపర్), ఆలివర్ పీక్, రాఫ్ మాక్‌మిల్లన్, చార్లీ ఆండర్సన్, టామ్ స్ట్రాకర్, మహ్లీ బార్డ్‌మాన్, కల్లమ్ విడ్లర్.
ఇండియా U19 (ప్లేయింగ్ XI): ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్(కెప్టెన్), ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, ఆరవెల్లి అవనీష్(కీపర్), మురుగన్ అభిషేక్, రాజ్ లింబానీ, నమన్ తివారీ, సౌమీ పాండే.
U 19 ఫైనల్స్‌లో 'యువ భారత్' ట్రాక్ రికార్డ్
అండర్-19తో క్రికెట్లోకి ఎంట్రీ- ఒక్క రోహిత్ తప్ప అందరూ రిటైర్!