Ind vs Aus U19 Final 2024: ఏడాది కాలంలో జరిగిన రెండు ఐసీీసీ ఈవెంట్ ఫైనల్స్‌లో భారత్ ప్రత్యర్థి ఆస్ట్రేలియానే. ఈ రెండింట్లోనూ (డబ్ల్యూటీసీ, వన్డే ప్రపంచకప్) ఓటములను చవిచూసింది భారత్. ప్రస్తుతం జరుగుతున్న 2024 అండర్-19 ఫైనల్లోనూ యువ భారత్ ఆదివారం అదే ఆసీస్‌ను ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో బెనోనీలోని విల్లోమూర్ పార్క్ మైదానంలో ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమ్ఇండియా సారథి ఉదయ్ సహరన్ మాట్లాడాడు. ఈ చిట్‌చాట్ కార్యక్రమంలో జట్టు విజయంపై ఓ కీలక వ్యాఖ్యలు చేశాడు.
మీరు ఈ మ్యాచ్‌ను రివెంజ్‌లా భావిస్తున్నారా?
అండర్-19 ప్రపంచకప్‌ను మన ఆటగాళ్లు గత వన్డే ప్రపంచకప్ ఓటమికి ఓ రివెంజ్ మ్యాచ్‌లా తీసుకొని ఆడాలని కోరుకుంటున్నారు క్రికెట్ లవర్స్. ఇప్పటికే సీనియర్ల టోర్నమెంట్లైన 2023 డబ్ల్యూటీసీ ఛాంపియన్షిప్, 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది భారత్. ఇప్పుడు మరో మెగా టోర్నీకి రెడీ అయింది. అయితే ఈ మ్యాచ్‌ను మీరు 2023 ప్రపంచకప్ ఓటమికి కంగారులపై రివెంజ్‌లా భావిస్తున్నారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు ఉదయ్. 'అలాంటిదేమీ లేదు, దీన్ని మేం ప్రతికార మ్యాచ్‌గా అస్సలు భావించట్లేదు' అని రియల్ స్పోర్ట్మన్షిప్లా బదులిచ్చాడు. ఇది విన్న ఫ్యాన్స్ కెప్టెన్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మ్యాచ్‌లో గెలుపు సాధించాలంటూ ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు.
అంతకుముందు ఉత్కంఠభరితంగా జరిగిన సెమీఫైనల్ మ్యాచుల్లో భారత్, ఆస్ట్రేలియా ప్రత్యర్థి జట్లపై విజయం సాధించాయి. ఆతిథ్యం ఇస్తున్న దక్షిణాఫ్రికాపై భారత్ 2 వికెట్ల తేడాతో గెలుపొందగా ఆస్ట్రేలియా దాయాది దేశం పాక్‌పై 1 వికెట్ తేడాతో గెలుపొందింది. దీంతో భారత్ తొమ్మిదోసారి ఫైనల్‌కు దూసుకొచ్చింది. కాగా, ఇరుజట్ల మధ్య ఇది మూడో అండర్-19 ఫైనల్ మ్యాచ్. ఈ టోర్నీలో భారత కెప్టెన్ ఉదయ్ సహరన్ 64 సగటుతో 389 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన లిస్ట్‌లో టాప్‌లో కొనసాగుతున్నాడు. ఇక ఈ జాబితాలో టాప్-3లో టీమ్ఇండియా బ్యాటర్లే ఉండడం విశేషం.