ETV Bharat / sports

మహిళల ప్రపంచకప్ 2024 - లంకపై భారత్ విజయం - WOMENS T20 WORLD CUP 2024

ప్రపంచకప్​లో భాగంగా లంకతో తాజాగా జరిగిన మ్యాచ్​లో మన అమ్మాయిలదే విజయం.

source Associated Press
Womens T20 World Cup 2024 IND VS SL (source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 9, 2024, 10:48 PM IST

Womens T20 World Cup 2024 IND VS SL : మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తాజా మ్యాచ్‌లో టీమ్ ఇండియా భారీ విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ పోరులో 82 పరుగులు తేడాతో గెలుపొందింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. 19.5 ఓవర్లలో 90 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.

లంక బ్యాటర్లలో కవషా దిల్హరి(21; 22 బంతుల్లో 1 ఫోరు), అనుష్క సంజీవని(20; 22 బంతుల్లో 2 పోర్లు), అమ కాంచనా(19) నామమాత్రపు పరుగులు చేయగా, మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. భారత మహిళా బౌలర్లలో అరుంధతి రెడ్డి, ఆషా శోభాన తలో మూడు వికెట్లు పడగొట్టగా, రేనుకా ఠాకూర్ సింగ్ 2 వికెట్లు తీసింది. శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ తలో వికెట్​ వికెట్ పడగొట్టారు.

అంతకుముందు బ్యాటింగ్​ చేసిన భారత్​ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (38 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్), షెఫాలి వర్మ (40 బంతుల్లో 43; 4 ఫోర్లు) మంచిగానే రాణించారు. చివర్లో కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (27 బంతుల్లో 52*; 8 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ చేసింది. జెమీమా రోడ్రిగ్స్‌ (16), రిచా ఘోష్ (6*) పరుగులు చేశారు. లంక బౌలర్లలో చమరి ఆటపట్టు, కంచన తలో వికెట్ తీశారు.

తెలుగు కుర్రాడు నితీశ్‌ కుమార్‌ ఊచకోత - టీమ్ ఇండియా భారీ స్కోర్‌

భారత్‌లోని ఆ 3 మైదానాల్లో టెస్ట్ సెంచరీ చేయని కోహ్లీ - ఎక్కడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.