ETV Bharat / sports

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్! - రిటైర్మెంట్​ తర్వాత అశ్విన్ ఏ పొజిషన్​లో ఉన్నాడంటే? - ICC TEST RANKINGS

ఐసీసీ ర్యాంకింగ్స్​లో బుమ్రా జోరు - అశ్విన్ ఏ పొజిషన్​లో ఉన్నాడంటే?

ICC Test Rankings
Ravichandran Ashwin (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Dec 18, 2024, 3:36 PM IST

Updated : Dec 18, 2024, 3:49 PM IST

ICC Test Rankings : తాజాగా విడుదలైన ఐసీసీ ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా అలాగే ఇంగ్లండ్ జట్టు జోరు కొనసాగుతోంది. బౌలింగ్‌లో 890 పాయింట్లతో టీమ్‌ఇండియా స్టార్‌ ప్లేయర్ జస్‌ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో అలాగే కొనసాగుతుండగా, కగిసో రబాడ మాత్రం 856 పాయింట్లకే పరిమితమయ్యాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్ 797 పాయింట్లతో ఐదో స్థానాన్ని సాధించాడు. అడిలైడ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన టెస్టులో మాత్రమే అతడు ఆడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరూ కాకుండా స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా 786 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. భారత్‌ తరఫున ఈ ముగ్గురే టాప్-10లో ఉండటం గమనార్హం.

బ్యాటింగ్​లో వారిద్దరే
ఇదిలా ఉండగా, ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లీష్ ప్లేయర్ జో రూట్‌ మళ్లీ టాప్​ పొజిషన్​కు చేరుకున్నాడు. న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో ఇంగ్లండ్‌ ఓటమి చవిచూసిప్పటికీ, రూట్‌ మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్​తో జట్టును పలు మార్లు ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 895 పాయింట్లతో టాప్​లో ఉన్న రూట్, తన కో ప్లేయర్ హ్యారీ బ్రూక్‌ (876)ను వెనక్కినెట్టి టాప్‌లోకి దూసుకెళ్లాడు. అయితే ఈ లిస్ట్​లో టాప్‌-10లో భారత జట్టు నుంచి యశస్వి జైస్వాల్ (811), రిషభ్ పంత్ (724) మాత్రమే ఉన్నారు.

ఆల్​రౌండర్​గా అతడే టాప్!
మరోవైపు టెస్టు ఫార్మాట్‌ ఆల్‌రౌండర్ల జాబితాలో టీమ్ఇండియా ప్లేయర్స్​ రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ టాప్‌ -10లో స్థానం దక్కించుకున్నారు. 415 పాయింట్లతో జడేజా టాప్‌లో ఉండగా, 283 పాయింట్లతో అశ్విన్ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక 234 అక్షర్ పటేల్ పదో స్థానంలో నిలిచారు.

ఇక టీ20 బ్యాటింగ్‌ లిస్ట్‌లో ట్రావిస్‌ హెడ్ (855), ఫిల్‌ సాల్ట్ (829), తిలక్ వర్మ (806), సూర్యకుమార్ యాదవ్ (788), జోస్ బట్లర్ (717) టాప్‌ -5లో తమ తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నారు. అయితే బౌలింగ్‌ ర్యాంకుల్లో వెస్టిండీస్​ ప్లేయర్ అకీల్ హుసేన్ (707) మూడు స్థానాలను ఎగబాకి అగ్రస్థానానికి వచ్చాడు. ఇక భారత్‌ నుంచి ఆరో స్థానంలో రవి బిష్ణోయ్ (666), ఎనిమిదో స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ (656) ఉన్నారు.

గబ్బాలో గట్టెక్కాం- మరి భారత్ WTC ఫైనల్ సంగతేంటి?

అశ్విన్ రిటైర్మెంట్​తో విరాట్ ఎమోషనల్ పోస్ట్- ఆ రోజులన్నీ గుర్తొచ్చాయట!

Last Updated : Dec 18, 2024, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.