ETV Bharat / sports

టాప్ పొజిషన్​లోకి అశ్విన్- ర్యాంకింగ్స్​లో హిట్​మ్యాన్ జోరు

ICC Test Rankings 2024: ఐసీసీ బుధవారం టెస్టు ర్యాంకింగ్స్ రిలీజ్ చేసింది. ఈ ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్ అగ్రస్థానం దక్కించుకున్నాడు.

ICC Test Rankings 2024
ICC Test Rankings 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 13, 2024, 3:11 PM IST

Updated : Mar 13, 2024, 4:36 PM IST

ICC Test Rankings 2024: టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు ర్యాంకింగ్స్​లో నెం.1 స్థానానికి చేరుకున్నాడు. రీసెంట్​గా ముగిసిన ఇంగ్లాండ్ టెస్టు సిరీస్​లో అదరగొట్టిన అశ్విన్ బౌలింగ్ విభాగంలో 870 రేటింగ్స్​తో ఒక స్థానం మెరుగుపర్చుకొని అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. కాగా, టెస్టు ర్యాంకింగ్స్​లో టాప్​ పొజిషన్​కు చేరుకోవడం అశ్విన్​కు ఇది ఆరోసారి. ఇక పేసర్ జస్ప్రీత్ బుమ్రా 847 రేటింగ్స్​తో ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్​వుడ్​తో కలిసి రెండో స్థానాన్ని షేర్ చేసుకుంటున్నాడు.

టాప్-5లో ఉన్న బౌలర్లు

  • రవిచంద్రన్ అశ్విన్ (భారత్)- 870 రేటింగ్స్
  • జోష్ హేజిల్​వుడ్ (ఆస్ట్రేలియా)- 847 రేటింగ్స్
  • జస్ప్రీత్ బుమ్రా (భారత్)- 847 రేటింగ్స్
  • కగిసొ రబాడా (సౌతాఫ్రికా)- 834 రేటింగ్స్
  • ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా)- 820 రేటింగ్స్​

మరోవైపు బ్యాటింగ్ విభాగంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా ఐదు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ 751 రేటింగ్స్​లో ఆరో పొజిషన్​లో కొనసాగుతున్నాడు. ఇక యంగ్ బ్యాటర్ యశస్వీ జైశ్వాల్ రెండు స్థానాలు ఎగబాకి 8వ ర్యాంక్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం జైశ్వాల్ 740 రేటింగ్స్​తో ఉన్నాడు. అయితే టెస్టు కెరీర్​లో జైశ్వాల్ 9 మ్యాచ్​ల్లోనే 700+ రేటింగ్స్ సాధించడం విశేషం.

ఈ నేపథ్యంలో 9 మ్యాచ్​ల తర్వాత అత్యధిక రేటింగ్స్ సాధించిన లిస్ట్​లో జైశ్వాల్ మూడో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు డాన్ బ్రాడ్​మన్ (742 రేటింగ్స్), మైక్ హస్సీ (741 రేటింగ్స్​) మాత్రమే జైశ్వాల్​ కంటే ముందున్నారు. కాగా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 737 రేటింగ్స్​తో తొమ్మిదో ప్లేస్​కు పడిపోయాడు. దీంతో బ్యాటింగ్ ర్యాంకింగ్స్​ టాప్- 10లో ముగ్గురు భారత్ ప్లేయర్లు స్థానం దక్కించుకున్నారు. ఇక ఇంగ్లాండ్​ సిరీస్​లో మెరుగ్గా రాణించిన యంగ్ బ్యాటర్ శుభ్​మన్ గిల్ ఏకంగా 11 స్థానాలు ఎగబాకాడు. అతడు ప్రస్తుతం 664 రేటింగ్స్​తో 21వ స్థానంలో కొనసాగుతున్నాడు.

టాప్-5లో ఉన్న బ్యాటర్లు

  • కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్)- 859 రేటింగ్స్
  • జో రూట్ (ఇంగ్లాండ్)- 824 రేటింగ్స్
  • బాబర్ అజామ్ (పాకిస్థాన్)- 768 రేటింగ్స్
  • డారిల్ మిచెల్ (న్యూజిలాండ్)- 768 రేటింగ్స్​
  • స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 757 రేటింగ్స్

మూడు ఫార్మాట్లలో టీమ్ఇండియానే నెం.1- ర్యాంకింగ్స్​లో భారత్ డామినేషన్​

కెరీర్​లో బెస్ట్ ప్లేస్​కు యశస్వి- టాప్​ 10లోకి దూసుకుపోయాడుగా

Last Updated : Mar 13, 2024, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.