ETV Bharat / sports

టెస్టు ర్యాంకింగ్స్ రిలీజ్- అగ్రస్థానానికి చేరువలో రూట్- మరి రోహిత్, విరాట్ ప్లేస్? - ICC Test Ranking 2024 - ICC TEST RANKING 2024

ICC Test Ranking 2024: ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన టెస్టు ర్యాంకింగ్స్​లో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ రూట్ మెరుగైన పాయింట్లు సాధించి, తొలి స్థానానికి చేరువలోకి వెళ్లాడు.

ICC Test Ranking 2024
ICC Test Ranking 2024 (Source: Getty Images (Left, Right), Associated Press (Middle))
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 24, 2024, 3:18 PM IST

ICC Test Ranking 2024: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం లేటెస్ట్​ టెస్ట్​ ర్యాకింగ్స్ విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్​లో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ 12 రేటింగ్ పాయింట్లు మెరుగుపర్చుకొని, ఆగ్రస్థానంలో ఉన్న కేన్ విలియమ్సన్ (859 రేటింగ్స్​)​కు అత్యంత చేరువలోకి వెళ్లాడు. ప్రస్తుతం రూట్ 852 రేటింగ్స్​తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ యంగ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (771 రేటింగ్స్) నాలుగు స్థానాలు ఎగబాకి, కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ 3వ ప్లేస్​కు చేరుకున్నాడు.

ఇక టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం కోల్పోయి 751 రేటింగ్స్​తో 7వ స్థానంలో ఉన్నాడు. యంగ్ బ్యాటర్ యశస్వీ జైశ్వాల్ (740 రేటింగ్స్) 8వ, విరాట్ కోహ్లీ (737 రేటింగ్స్)​తో 10వ స్థానాల్లో కొనసాగుతున్నారు. దీంతో ప్రస్తుతం టాప్- 10లో ముగ్గురు టీమ్ఇండియా బ్యాటర్లు ఉన్నారు.

టాప్ -5 బ్యాటర్లు

1కేన్ విలియమ్సన్న్యూజిలాండ్859 రేటింగ్స్
2జో రూట్ఇంగ్లాండ్852 రేటింగ్స్
3హ్యారీ బ్రూక్ఇంగ్లాండ్771 రేటింగ్స్
4బాబర్ ఆజమ్పాకిస్థాన్768 రేటింగ్స్
5డారిల్ మిచెల్న్యూజిలాండ్768 రేటింగ్స్

Test Bowling Ranking: కాగా, బౌలింగ్ విభాగంలో టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టాప్​లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అశ్విన్ 870 రేటింగ్స్​తో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక ఆసీస్ పేసర్ జోష్ హేజిల్​వుడ్, టీమ్ఇండియా స్టార్ జస్ప్రీత్ బుమ్రా ఇద్దరూ 847రేటింగ్స్​తో వరుసగా 2,3 స్థానాల్లో ఉన్నారు. రవీంద్ర జడేజా 788 రేటింగ్స్​తో 7వ ప్లేస్​లో కొనసాగుతున్నాడు. రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 686 రేటింగ్స్​తో 14వ పొజిషన్​లో ఉన్నాడు.

టాప్ 5 బౌలర్లు

1రవిచంద్రన్ అశ్విన్ భారత్870 రేటింగ్స్
2జోష్ హేజిల్​వుడ్ ఆస్ట్రేలియా847 రేటింగ్స్
3జస్ప్రీత్ బుమ్రాభారత్ 847 రేటింగ్స్
4కగిసో రబాడాసౌతాఫ్రికా834 రేటింగ్స్
5ప్యాట్ కమిన్స్ఆస్ట్రేలియా820 రేటింగ్స్

Test All Rounder Ranking: అటు ఆల్​రౌండర్ విభాగంలో టాప్- 5లోనే ముగ్గురు టీమ్ఇండియా ప్లేయర్లు ఉన్నారు. 444 రేటింగ్స్​తో జడేజా టాప్ ప్లేస్​లో కొనసాగుతుండగా, అశ్విన్ (322 రేటింగ్స్) రెండో పొజిషన్​లో ఉన్నాడు. అక్షర్ పటేల్ (259 రేటింగ్స్) 5వ స్థానంలో కొనసాగుతున్నాడు.

జైశ్వాల్ బెస్ట్ ప్లేస్- దూసుకొచ్చిన గిల్- T20 ర్యాంకింగ్స్ రిలీజ్​

నెం.1 ప్లేస్ నుంచి సూర్య డౌన్- టాప్​లోకి ఆ స్టార్ బ్యాటర్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.