ICC T20 Rankings 2024 : ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో తాజాగా యంగ్ క్రికెటర్ అర్షదీప్ సింగ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఎనిమిది స్థానాలు పైకి ఎగబాకి ఎనిమిదో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ తరఫున బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అర్ష్‌దీప్ ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్ నాలుగు స్థానాలు మెరుగై 35వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ ఇంకా టాప్ పొజిషన్లో కొనసాగుతున్నాడు. మరోవైపు రవి బిష్ణోయ్ తాజా ర్యాంకింగ్స్‌లో 12వ ర్యాంక్‌కు దిగజారాడు.
ఇదిలా ఉండగా, ఆల్‌రౌండర్ల జాబితాలో నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని మూడో స్థానంలో నిలిచాడు స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య. ఇక అక్షర్ పటేల్ 11వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్‌కు చెందిన లియామ్ లివింగ్‌స్టోన్ 253 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ICC టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్
1. ఆదిల్ రషీద్ - 721 పాయింట్లు
2. అకేల్ హోసేన్ - 695 పాయింట్లు
3. రషీద్ ఖాన్ - 668 పాయింట్లు
4. గుడాకేష్ మోటీ - 664 పాయింట్లు
5. వనిందు హసరంగా - 663 పాయింట్లు
6. ఆడమ్ జంపా - 662 పాయింట్లు
7. ఫజల్హక్ ఫరూఖీ - 645 పాయింట్లు
8. అన్రిచ్ నోర్ట్జే - 642 పాయింట్లు
8. అర్ష్‌దీప్ సింగ్ - 642 పాయింట్లు
10. మహేశ్ తీక్షణ - 640 పాయింట్లు
ICC టీ20 ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్
1. లియామ్ లివింగ్‌స్టోన్ - 253 పాయింట్లు
2. దీపేంద్ర సింగ్ ఎయిరీ - 235 పాయింట్లు
3. హార్దిక్ పాండ్యా - 211 పాయింట్లు
గతంలో విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ కెరీర్ బెస్ట్ ప్లేస్ సొంతం చేసుకున్నాడు. 739 రేటింగ్స్‌తో ఏడు స్థానాలు ఎగబాకి ప్రస్తుతం అరో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. మరోవైపు స్పిన్నర్ అక్షర్ పటేల్ కూడా కెరీర్ బెస్ట్ ర్యాంక్ దక్కించుకున్నాడు. అతడు ఏకంగా 12 స్థానాలు మెరుగుపర్చుకొని 667 రేటింగ్స్‌తో ఐదో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో సూర్యకుమార్ (869 రేటింగ్స్) అగ్రస్థానంలో ఉండగా, రుతురాజ్ గైక్వాడ్ (661)తో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ శివమ్ దూబే 256వ ప్లేస్ నుంచి 58వ స్థానానికి జంప్ చేశాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 516 రేటింగ్స్‌తో 44వ స్థానంలో ఉన్నాడు.
ఐసీసీ ర్యాంకింగ్‌లో బుమ్రా టాప్- కోహ్లీ, రోహిత్ ఏ పొజిషన్లో ఉన్నారంటే? - ICC Test Rankings 2024
ఒక్క సెంచరీతో ర్యాంకింగ్స్‌లోకి పంత్ రీ ఎంట్రీ - రోహిత్, విరాట్ బిగ్ డ్రాప్ - ICC Ranking 2024