ETV Bharat / sports

టాప్‌ 5లోకి రోహిత్- శ్రీలంక ప్లేయర్ ఏకంగా 42 స్థానాలు జంప్ - ICC Test Ranking 2024

author img

By ETV Bharat Sports Team

Published : Sep 11, 2024, 3:20 PM IST

ICC Test Ranking 2024 : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం తాజా టెస్టు ర్యాంకింగ్స్ రిలీజ్ చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో శ్రీలంక బ్యాటర్ నిస్సంక 42 స్థానాలు ఎగబాకాడు.

ICC Test Ranking
ICC Test Ranking (Source : Getty Images)

ICC Test Ranking 2024 : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో శ్రీలంక బ్యాటర్ పాతుమ్ నిస్సంకా ఏకంగా 42స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన నిస్సంకా ప్రస్తుతం 568 రేటింగ్స్‌తో 39వ స్థానంలో ఉన్నాడు. ఈ టెస్టు సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన నిస్సంకా, నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 217 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఇక ఇదే సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ టాప్ - 10లో చోటు కోల్పోయాడు. అతడు తాజా ర్యాంకింగ్స్‌లో 7 స్థానాలు కోల్పోయి ప్రస్తుతం 12వ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.

ఇక టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం మెరుగుపర్చుకుని టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం రోహిత్ 751 రేటింగ్స్‌తో 5వ స్థానంలో ఉన్నాడు. కాగా, టీమ్ఇండియా నుంచి టాప్ 5లో రోహిత్ ఒక్కడే ఉండడం విశేషం. ఇక యంగ్ బ్యాటర్ యశస్వీ జైశ్వాల్, విరాట్ కోహ్లీ వరుసగా 6, 7 స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ 899 రేటింగ్స్‌తో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు.

టెస్టుల్లో టాప్ 5 బ్యాటర్లు

1జో రూట్ ఇంగ్లాండ్899 రేటింగ్స్‌
2కేన్ విలియమ్సన్న్యూజిలాండ్859 రేటింగ్స్
3డారిల్ మిచెల్ న్యూజిలాండ్768 రేటింగ్స్
4స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా 757 రేటింగ్స్
5రోహిత్ శర్మభారత్751 రేటింగ్స్

రోహిత్ ఒకే ఒక్కడు
ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో 5వ స్థానంలో కొనసాగుతున్న రోహిత్ శర్మ, వన్డేల్లో నెం. 2 బ్యాటర్‌గా ఉన్నాడు. వన్డేల్లో 765 రేటింగ్స్‌లో రోహిత్ 2వ ప్లేస్‌లో ఉేన్నాడు. అయితే టీమ్ఇండియా నుంచి రెండు ఫార్మాట్లలో టాప్ 5లో ఉన్న ఏకైక బ్యాటర్ రోహిత్ శర్మే.

ఇక బౌలింగ్ విభాగంలో టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 870 రేటింగ్స్‌తో అగ్రస్థానం పదిలం చేసుకున్నాడు. ఆసీస్ పేసర్ జోష్ హేజిల్ వుడ్ (847 రేటింగ్స్)తో కలిసి మన స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (847 రేటింగ్స్) రెండో స్థానంలో ఉన్నాడు. తర్వాత ప్యాట్ కమిన్స్ (820 రేటింగ్స్), కగిసొ రబాడా వరుస ప్లేస్‌ల్లో ఉన్నారు.

ICC ర్యాంకింగ్ సిస్టమ్- ఎలా లెక్కిస్తారో తెలుసా? - ICC Rankings System

'అవును నిజమే నేను టెస్టుల్లో సరిగ్గా ఆడలేదు' - 2024 Duleep Trophy

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.