ICC Rankings System: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించే ర్యాంకులు ప్రస్తుత క్రికెట్ ప్రపచంలో చాలా కీలకం. ఈ ర్యాంకులు మూడు ఫార్మాట్‌లలోని ఆటగాళ్లు, జట్ల ప్రదర్శనను తెలియజేస్తాయి. ఈ ర్యాంకులు ప్రస్తుత ఫామ్, గత ప్రదర్శనలు రెండింటినీ పరిగణించే డీటైల్డ్ సిస్టమ్‌పై ఆధారపడి ఉంటాయి. అయితే ఐసీసీ ర్యాంకులను ఎలా కాలిక్యులేట్ చేస్తుంది? ఏ ఆధారంగా ఆటగాళ్లకు ర్యాంకులు కేటాయిస్తుంది? అని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. మరి ఐసీసీ ఈ ర్యాంకింగ్స్‌ను ఎలా కాలిక్యులేట్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం.
ర్యాంకులు ఎలా లెక్కిస్తారు?
ప్లేయర్ ర్యాంకులు: ఐసీసీ ప్రతి ఫార్మాట్‌లో బ్యాటర్లు, బౌలర్లు, ఆల్- రౌండర్లకు విడిగా ర్యాంకులు లెక్కిస్తుంది. టెస్టు, వన్డే, టీ20లకు వేర్వేరుగా ప్రకటిస్తుంది.
- బ్యాటింగ్: బ్యాటర్ స్కోర్ చేసిన ప్రతీ పరుగుకి పాయింట్లు పొందుతారు. హాఫ్ సెంచరీలు, సెంచరీలు కొట్టినందుకు అదనపు పాయింట్లు లభిస్తాయి. మొత్తం పాయింట్లను ఆటగాడు ఆడిన ఇన్నింగ్స్‌ల సంఖ్యతో భాగిస్తారు. ఈ పద్ధతి బ్యాటర్ నిలకడతో కూడిన ప్రదర్శనను సూచిస్తుంది.
- బౌలింగ్: బౌలర్లు వారు తీసే ప్రతీ వికెట్‌కు పాయింట్లు పొందుతారు. మెరుగైన బౌలింగ్ యావరేజ్ ఉన్నవారికి అదనపు పాయింట్లు దక్కుతాయి. మొత్తం పాయింట్లను ఆడిన మ్యాచ్‌ల సంఖ్యతో భాగిస్తారు. బౌలర్ వికెట్లు తీయగల సామర్థ్యం, ఇచ్చిన పరుగుల పరంగా వారి సామర్థ్యం రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటుంది.
- ఆల్ రౌండర్లు: ఆల్ రౌండర్లు వారి బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనల ఆధారంగా ర్యాంకు పొందుతారు. ఐసీసీ వీరికి ఒక నిర్దిష్ట సూత్రాన్ని ఉపయోగిస్తుంది. అటు బ్యాటు, ఇటు బంతితో అందించిన సహకారాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. గేమ్‌పై వారి మొత్తం ప్రభావం కచ్చితంగా అంచనా వేసి పాయింట్లు కేటాయిస్తుంది.
జట్టు ర్యాంకింగ్‌లు: జట్లకు కూడా మూడు ఫార్మాట్‌లలో వేర్వేరుగా ర్యాంకులు ప్రకటిస్తుంది.
- టెస్టు, వన్డేలు: ప్రత్యర్థి జట్టు బలం ఆధారంగా, జట్లు విజయాలు, ఓటములు, డ్రా లకు పాయింట్లు ఉంటాయి. తక్కువ ర్యాంక్ ఉన్న జట్టుపై విజయం కంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న జట్టుపై గెలవడం వల్ల అధిక పాయింట్లు లభిస్తాయి.
- టీ20:టెస్టు, వన్డేల మాదిరిగానే టీ20లో ర్యాంకులు లెక్కిస్తారు. అయితే ఈ ఫార్మాట్‌లో అదనంగా విన్నింగ్ మార్జిన్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
ఈ ర్యాంకులు దేన్ని సూచిస్తాయి?
ఐసీసీ ర్యాంకింగ్‌లు ఆటగాడి లేదా జట్టు ఫామ్, గత ప్రదర్శనలకు సూచికగా పని చేస్తాయి. అలానే జాతీయ జట్ల ఎంపికలో ర్యాంకులు సహాయపడతాయి. ముఖ్యంగా ఆటగాళ్లను ఎంపిక చేయడానికి డొమెస్టిక్ క్రికెట్ డేటా అందుబాటులో లేనప్పుడు, ర్యాంకులపై ఆధారపడుతారు. మంచి ర్యాంకు ఉన్న ప్లేయర్, జట్టుకి మరింత లాభదాయకమైన స్పాన్సర్‌షిప్ ఒప్పందాలు, ఎండార్స్‌మెంట్స్ వస్తాయి. అంతర్జాతీయ మ్యాచ్‌లు, పర్యటనల షెడ్యూల్‌ను కూడా ప్రభావితం చేయవచ్చు. ఎందుకంటే జట్లు మెరుగైన ఎక్స్‌పోజర్, రాబడి కోసం అధిక-ర్యాంక్ ఉన్న ప్రత్యర్థులతో ఆడటానికి ఇష్టపడతాయి.
Big shifts in the ICC Men's Test Player Rankings following the #ENGvSL and #PAKvBAN matches 📈📉#WTC25 | Details 👇https://t.co/Tna2KVtZLH
— ICC (@ICC) August 28, 2024
విరాట్, యశస్వి ముందుకు- బాబర్ ర్యాంక్ ఢమాల్ - ICC Rankings
ICC ర్యాంకింగ్స్: సత్తాచాటిన రోహిత్, గిల్, విరాట్- టాప్ 5లో ముగ్గురు మనోళ్లే - ICC Ranking