ETV Bharat / sports

జై షా నెట్​వర్త్- ICC కొత్త ఛైర్మన్ ఆస్తులు ఎంతో తెలుసా? - Jay Shah Net Worth

author img

By ETV Bharat Sports Team

Published : Aug 29, 2024, 5:41 PM IST

Jay Shah Net Worth: బీసీసీఐ సెక్రటరీ జై షా రీసెంట్​గా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్​గా ఏన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయన ఆస్తుల విలువ ఎంతో ఉంటుందని నెటిజన్లు ఇంటర్నెట్​లో వెతికేస్తున్నారు. మరి ఆయన నెట్​వర్త్ ఎంతో తెలుసా?

Jay Shah Net Worth
Jay Shah Net Worth (Source: ETV Bharat)

Jay Shah Net Worth: బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జై షా, తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి ఆయన ఐసీసీ ఛైర్మన్​గా బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో ఈ అత్యున్నత పదవి చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా (35) జై షా చరిత్రకెక్కనున్నారు. ఈ క్రమంలో జై షా ఆస్తులు, సంపదపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. మరి జైషా ఆస్తులు ఎంతో తెలుసా?

కోట్లు విలువైన ఆస్తి!
జై షాకు వ్యాపారమే ప్రధాన ఆదాయ వనరు. అలాగే బీసీసీఐ నుంచి జై షాకు అలవెన్సులు, స్టైఫెండ్ వస్తుంది. అలా విదేశీ పర్యటనలు, సమావేశాలకు బీసీసీఐ రోజుకు రూ.82వేలు చెల్లిస్తుంది. ఇక కుసుమ్ ఫిన్‌సెర్వ్‌ (Kusum Finserv) లో జై షాకు 60 శాతం వాటా ఉంది. ఇలా పలు వ్యాపారాల్లోనూ జై షా పెట్టుబడులు పెట్టారు. అలాగే బీసీసీఐలో అత్యన్నత పదవిలో ఉండడం వల్ల ఆయన నెట్​వర్త్​పై ఇవన్నింటితో కలిపి జై షా ఆస్తి రూ.124 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.

క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ పై పట్టు
జై షాకు క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌ పై మంచి పట్టు ఉంది. అందుకే చిన్న వయసులోనే బీసీసీఐ సెక్రటరీగా, ఇప్పుడు ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2009లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ క్రికెట్ అహ్మదాబాద్ (CBCA) మెంబర్‌గా మొదలైన జైషా ప్రస్థానం, తాజాగా ఐసీసీలో టాప్ పొజిషన్ వరకు చేరింది. దీంతో జైషాపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ICC ఛైర్మన్ దాకా
2019లో జై షా బీసీసీఐ సెక్రటరీ అయ్యారు. దాదాపుగా ఐదేళ్ల నుంచి జై షా ఇదే పదవిలో కొనసాగుతున్నారు. ఇటీవల ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. భారత్‌ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ఛైర్మన్‌గా ఎన్నికైన ఐదో వ్యక్తిగా జై షా నిలిచారు. ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్‌ గా గ్రెగ్‌ బార్క్‌లే కొనసాగుతున్నారు. అతడు మరో దఫా ఛైర్మన్‌గా కొనసాగడానికి అర్హత ఉన్నా కొనసాగడానికి విముఖత చూపారు. దీంతో తాజాగా జరిగిన ఎన్నికల్లో జై షా ఏకగ్రీవమయ్యారు.

ICC ఛైర్మన్ జై షా శాలరీ ఎంతో తెలుసా? - Jay Shah ICC Salary

జిల్లా స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు - గ్లోబల్​ క్రికెట్​లో జై షా పవర్​ఫుల్​గా​ ఎలా ఎదిగారంటే? - ICC New Chairman Jay Shah

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.