Siraj Head Fight : అడిలైడ్ పింక్ బాల్ టెస్టు సందర్భంగా టీమ్ఇండియా బౌలర్ మహ్మద్ సిరాజ్- ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన మాటల యుద్ధం క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో వీరిద్దరి ప్రవర్తనను ఐసీసీ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే వీరిపై ఐసీసీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.
ఆటగాళ్లిద్దరూ క్రమశిక్షణా నియామవళి ఉల్లంఘించారని భావిస్తున్న ఐసీసీ, వీరిని మందలించి జరిమానా విధించే ఛాన్స్ ఉన్నట్లు ఆస్ట్రేలియా మీడియా వెబ్సైట్లు తమ కథనాల్లో పేర్కొన్నాయి. అయితే ఐసీసీ క్రమశిక్షణా నియమావళిని వీరు పూర్తిగా ఉల్లంఘించకపోవడం వల్ల సస్పెన్షన్ విధించే ఛాన్స్ లేకపోవచ్చు. ఇక ఈ వ్యవహారంపై ఐసీసీ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదీ జరిగింది
భారత్- ఆసీస్ రెండో టెస్టు రెండో రోజు ట్రావిస్ హెడ్‌ను 140 వ్యక్తిగత పరగుల వద్ద సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ సమయంలో సిరాజ్ సంబరాలు చేసుకుంటుండగా, హెడ్ తన వైపు చూస్తూ ఏదో అన్నట్లు కనిపించింది. దీంతో సిరాజ్ పట్టరాని కోపంతో 'వెళ్లవయ్యా వెళ్లు' అన్నట్లు సైగ చేశాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరలైంది. సిరాజ్ అలా ప్రవర్తించి ఉండకూడదని పలువురు మాజీలు అభిప్రాయపడ్డారు.
నేను అలా అనలేదు- అది అబద్దం!
ఈ వ్యవహారంపై హెడ్ ఇన్నింగ్స్ అనంతరం స్పందించాడు. తాను సిరాజ్‌ను ఏమీ అనలేదని, అద్భుతంగా బౌలింగ్ చేశావని చెప్పానని పేర్కొన్నాడు. 'సిరాజ్‌ను నేను ఏమీ అనలేదు. మంచిగా బౌలింగ్ చేశావు' అని అన్నట్లు తెలిపాడు. దీనిపై సిరాజ్ కూడా రెస్పాండ్ అయ్యాడు. మీడియా ముందు హెడ్ చెప్పింది అబద్దం అని అన్నాడు. 'వికెట్ తీసిన ఆనందంలో నేను సెలబ్రేషన్స్ చేసుకుంటున్నా. మీరు కూడా టీవీల్లో చూశారు కదా. అతడిని నేను ఏమీ అనలేదు. అద్భుతంగా బౌలింగ్ చేశావు అని అన్నట్లు హెడ్ చెప్పిందంతా అబద్దమే' అని సిరాజ్ పేర్కొన్నాడు..
Siraj shouldn't have been aggressive to a superior Australian.
— Dinda Academy (@academy_dinda) December 7, 2024
Instead he should have said sorry to Travis Head for getting his wicket 🫡pic.twitter.com/I4wmkhKHP2
దోస్త్ మేరా దోస్త్
ఈ వివాదం నేపథ్యంలో మూడో రోజు ఆటలో సిరాజ్ బ్యాటింగ్ చేస్తుండగా హెడ్ దగ్గరకు వెళ్లాడు. వీళ్లద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. సరదాగా కాసేపు ఏదో మాట్లాడుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య గొడవకు ఎండ్ కార్డ్ పడింది.
Travis Head: " i swear i said well bowled."
— Sameer Allana (@HitmanCricket) December 8, 2024
mohammed siraj: "i also said well batted."
travis head: "cool."pic.twitter.com/ODqRhHo2Eh
పింక్ బాల్ టెస్టులో భారత్ ఘోర ఓటమి- మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్
'హోటల్ రూమ్‌లో ఖాళీగా కూర్చోవద్దు- ఆ అడ్వాంటేజ్ వాడుకొని ప్రాక్టీస్ పెంచండి!'