ICC Champions Trophy 2025 Teamindia : పాకిస్థాన్ వేదికగా వచ్చే ఏడాది జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా ఆడుతాదా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. అయితే తాము పాకిస్థాన్‌లో ఆడేది లేదని ఇప్పటికే పలు సార్లు తేల్చి చెప్పేసింది. అయినా ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పాక్ జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రీసెంట్‌గానే కెప్టెన్‌గా ఎంపికైన వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఈ విషయంపై స్పందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు పాకిస్థాన్‌కు భారత జట్టు రావాలని విజ్ఞప్తి చేశాడు.
"పాకిస్థాన్ ఫ్యాన్స్ భారత క్రికెటర్లపై ప్రేమ చూపిస్తారు. మేం కూడా టీమ్ ఇండియా ఫ్యాన్స్ నుంచి 2023 ప్రపంచకప్ సమయంలో అలాంటి ప్రేమనే పొందాము. అందుకే పాక్‌కు భారత్ వచ్చి ఆడాలని మేం కోరుకుంటున్నాం. కానీ భారత్ ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌కు వస్తారా, రారా? అనేది నాకు తెలియదు. ఒకవేళ వస్తే మాత్రం టీమ్ ఇండియాకు ఇక్కడ అద్భుతమైన స్వాగతం దక్కుతుంది." అని రిజ్వాన్ పేర్కొన్నాడు.
ICC champions trophy 2025 Schedule : కాగా, 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మొదలు కానుంది. తుది పోరు మార్చి 9న జరగనుంది. ఇందుకోసం లాహోర్, కరాచీ, రావల్పిండిలను వేదికలుగా తీర్చిదిద్దుతున్నారు. అయితే టీమ్ ఇండియా రానని చెప్పిన నేపథ్యంలో తటస్థ వేదికలను ఏర్పాటు చేసి హైబ్రిడ్ ఫార్మాట్‌లో ఈ టోర్నీ నిర్వహించాలనే సూచనలూ వస్తున్నాయి.
మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోసిన్ నఖ్వీ మాత్రం, ఛాంపియన్స్ ట్రోఫీ పాక్‌లోనే జరుగుతుందని, అన్ని జట్లు ఇక్కడికి వస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే పాక్ - భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బీసీసీఐ టీమ్‌ఇండియాను దాయాది దేశానికి 2008 నుంచి పంపడం ఆపేసింది. ఐసీసీ ట్రోఫీల్లో మాత్రమే ఇరు జట్లు పోటీ పడుతున్నాయి.
శ్రేయస్‌ను సంప్రదించని కేకేఆర్ ఫ్రాంచైజీ! - ఇక జట్టుకు దూరమేనా!
'లేట్‌గా లేవడం, కుక్కలతో ఆడటం!' - ధోనీ డైలీ రొటీన్ ప్లాన్ ఏంటో తెలుసా?