Haris Rauf Pakistan Cricketer : పాకిస్థాన్ జట్టు స్టార్ క్రికెటర్ హారిస్ రవూఫ్ తాజాగా ఓ అభిమానితో వాగ్వాదానికి దిగాడు. తన సతీమణి వద్దని వారిస్తున్నా ఆమె మాట వినకుండా ఆ వ్యక్తిపైకి దూసుకెళ్లాడు. దీంతో అక్కడ కాసేపు వరకు గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే వాగ్వాదానికి సంబంధించిన అసలు కారణం తెలియనప్పటికీ, ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు కోపాద్రిక్తుడై హారిస్ రవూఫ్ ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏమైందంటే?
ఇదీ జరిగింది!
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా జరిగిన మ్యాచుల్లో పాకిస్థాన్ గ్రూప్ దశలోనే ఘోర పరాజయం పాలైంది. దీంతో సూపర్ 8కి చేరుకోకుండానే నిష్క్రమించింది. దీంతో పాక్ ప్లేయర్లందరూ ఇంటిబాట పట్టగా, హారిస్ రవూఫ్‌తో పాటు మరో ఐదు మంది ప్లేయర్లు మాత్రం ఇంకా అమెరికాలోనే ఉన్నారు. వాళ్లందరూ కొన్ని రోజులు అక్కడే గడిపిన తర్వాత పాక్‌కు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అమెరికాలో తన ఫ్యామిలీతో కలిసి తిరుగుతున్న హారిస్‌ను ఓ అభిమాని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కనిపించాడు. దీంతో ఆగ్రహించిన రవూఫ్ అతడిపై దాడికి యత్నించాడు. అయితే అక్కడే ఉన్న తన సతీమణి, ఇంకా మిగతా పర్యటకులందరూ హారిస్‌ను ఆపేందుకు యత్నించారు. అయినప్పటికీ అతడు తగ్గలేదు. కానీ కాసేపటికే గొడవ సద్దుమణిగింది.
ఇదిలా ఉండగా, సదరు అభిమాని భారత్‌కు చెందినవాడని భావించి హారిస్ రవూఫ్ తనతో గొడవకు దిగినట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. కానీ తాను పాకిస్థాన్ వ్యక్తినంటూ చెప్పడం కూడా ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది. అయితే హారీస్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేంతవరకూ అసలు నిజం బయటపడదు.
ఇదిలా ఉండగా, ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా నాలుగు మ్యాచ్‌లు ఆడిన హ్యారీస్ రౌఫ్ అందులో ఏడు వికెట్లు తీశాడు. అందులో భారత్‌పైనే(3/21) మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే బ్యాటర్ల వైఫల్యమై పాకిస్థాన్‌ను దెబ్బతీసిందని విశ్లేషకుల అభిప్రాయం.
ఫెర్గ్యూసన్ వరల్డ్రికార్డ్- 4 ఓవర్లూ మెయిడెన్లే- 3 వికెట్లు కూడా
టీమ్ఇండియాకు పొంచి ఉన్న డేంజర్ - ఆ గండం దాటితేనే సెమీస్‌కు! - T20 Worldcup 2024 Super