Hardhik Pandya Test Cricket : టీ20 వరల్డ్ కప్ హీరో, భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్టులకు దూరమైన సంగతి తెలిసిందే. వన్డేలు, టీ20ల్లో అదరగొట్టేస్తున్న అతడు సుదీర్ఘ ఫార్మాట్‌లో మాత్రం ఆడటం లేదు. అయితే ఇప్పుడతడు పునరాగమనం కోసం ఎదురు చూస్తున్నాడని తెలుస్తోంది. ఈ మధ్య అతడికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలే ఈ విషయాన్ని చెబుతున్నాయి.
ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు ఎంపికవ్వని హార్దిక్ పాండ్య రెడ్ బాల్ క్రికెట్‌పై ఫోకస్ పెట్టినట్లు క్రికెట్ వర్గాలు కూడా అంటున్నాయి. 2018లో చివరి సారిగా టెస్టు ఆడాడు హార్దిక్. అయితే అతడు మళ్లీ తెలుపు జెర్సీ వేసుకోవాలని భావిస్తున్నాడట.
ఆ మధ్య ఇంగ్లాండ్‌లో ఉన్న పాండ్య ఎర్ర బంతితో ప్రాక్టీస్ కూడా చేశాడు. అయితే ఇప్పుడీ ఆల్ రౌండర్ బరోడా జట్టు తరఫున దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడని తెలిసింది. తాజాగా అతడు నెట్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్ సాధన చేస్తూ కనిపించాడు. కాగా, చివరిసారిగా 2018లో బరోడాకు ఆడిన పాండ్యా దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఆ జట్టుతో కలుస్తాడని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటి వరకు హార్దిక్ పాండ్య 11 టెస్టుల్లో 523 పరుగులు చేసి 17 వికెట్లు పడగొట్టాడు.
దేశవాళీలో ఆడాల్సిందే - టెస్టు జట్టులోకి రావాలంటే ఫిట్‌నెస్ నిరూపించుకోవాలి. కాబట్టి దేశవాళీలో మ్యాచ్‌లు ఆడాల్సిందేనని ఈ ఏడాది ఆటగాళ్లకు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. పైగా బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్ ముగియగానే టీమ్ఇండియా స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. అనంతరం నవంబర్‌లో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా వెళ్లనుంది. అక్కడ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ రెండు సిరీస్‌లకు అందుబాటులో ఉండడం కోసం హార్దిక్, బరోడా తరఫున దేశవాళీ మ్యాచ్‌లు ఆడాలని నిర్ణయించుకున్నాడట. అందుకే హార్దిక్ టెస్టు జట్టులో చోటు కోసం దేశవాళీ క్రికెట్‌ను ఆడనున్నాడు.
సినిమాల్లోకి వార్నర్ ఎంట్రీ - 'పుష్ప 2'లో కీ రోల్- లుక్ వైరల్! - David Warner Pushpa 2
విరాట్ LBW కాంట్రవర్సీ - రోహిత్ రియాక్షన్ వైరల్- ఔటా, నాటౌటా? - Ind vs Ban Test Seires 2024