Gukesh World Champion : 2024 ఫిడే చెస్ ఛాంపియన్‌షిప్‌లో యంగ్ ప్లేయర్ గుకేశ్ ఓ అరుదైన రికార్డును నమోదు చేశాడు. తాజాగా జరిగిన చివరి సమ్మిట్ గేమ్‌లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించాడు. ఈ క్రమంలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా గుకేశ్ చరిత్రకెక్కాడు. 2012 తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్న తొలి భారతీయుడు కూడా గుకేశ్ కావడం విశేషం.
🇮🇳 GUKESH D WINS THE 2024 FIDE WORLD CHAMPIONSHIP! 👏 🔥#DingGukesh pic.twitter.com/aFNt2RO3UK
— International Chess Federation (@FIDE_chess) December 12, 2024
గేమ్ ఎలా సాగిందంటే?
గురువారం జరిగిన 14వ రౌండ్‌లో ఎంతో ఉత్కంఠగా సాగిన గేమ్‌లో చివరికి గుకేశ్ విజయాన్ని సాధించాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్‌ను సొంతం చేసుకున్న రెండో ఆటగాడిగా ఈ యంగ్ ప్లేయర్ చరిత్రకెక్కాడు. అయితే వాస్తవానికి బుధవారమే ఈ ఫలితం తేలాల్సింది. అయితే సుమారు 5 గంటల పాటు సాగిన 13వ రౌండ్‌లో ప్రత్యర్థులిద్దరూ చెరో పాయింట్‌ను పంచుకుఉన్నారు. కానీ విజయం కోసం 18 ఏళ్ల గుకేశ్ గట్టిగానే ప్రయత్నించినప్పటికీ 32 ఏళ్ల లిరెన్ చాలా కూల్‌గా ఆడి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. దీంతో 68 ఎత్తుల తర్వాత ఇద్దరు ప్లేయర్లు ఫలితం తేలకుండానే గేమ్ ముగించేందుకు అంగీకరించారు. మరోవైపు గురువారం జరిగిన 14వ రౌండ్‌లో విజయంతో ఒక పాయింట్ సాధించిన గుకేశ్ విజేతగా నిలిచాడు.
The emotional moment that 18-year-old Gukesh Dommaraju became the 18th world chess champion 🥲🏆 pic.twitter.com/jRIZrYeyCF
— Chess.com (@chesscom) December 12, 2024
10 ఏళ్ల కల - ఇప్పుడు నిజమైంది!
మరోవైపు చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్న తర్వాత గుకేశ్ మీడియాతో మాట్లాడాడు. ఓ వైపు ఆనందం వ్యక్తం చేస్తూనే మరోవైపు ఎమోషనల్ అయ్యాడు. గత 10 ఏళ్లుగా ఈ క్షణం కోసం కలలు కంటున్నానని పేర్కొన్నాడు. ఇప్పుడీ కలను సాకారం చేసుకున్నందుకు సంతోషంగా ఉందని అన్నాడు.
"నేను గెలుస్తానని అస్సలు అనుకోలేదు. అందుకే చాలా ఎమోషనల్ అయ్యాను. 10 ఏళ్ల నుంచి ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నాను. ఇప్పుడీ కల నిజమైనందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. నా దృష్టిలో డింగే రియల్ ఛాంపియన్. నేను నా ప్రత్యర్థికి థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను." అని గుకేశ్ అన్నాడు.
గుకేశ్ విజయం చరిత్రాత్మకం, ఆదర్శవంతం : ప్రధాని మోదీ
ఇదిలా ఉండగా, గుకేశ్ విజయంతో అతడికి ప్రముఖులు అలాగే అభిమానుల నుంచి శుభకాంక్షల వెల్లువ మొదలైంది. తాజాగా గుకేశ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అతడి విజయం చరిత్రాత్మకం, ఆదర్శవంతమని కొనియాడాడు. అంతేకాకుండా గుకేశ్ అసాధారణ ప్రతిభ, కృషి, సంకల్పమే ఈ ఫలితమని, గుకేశ్ భవిష్యత్ ప్రయత్నాలకు నా శుభాకాంక్షలంటూ మోదీ ట్వీట్ చేశారు.
Historic and exemplary!
— Narendra Modi (@narendramodi) December 12, 2024
Congratulations to Gukesh D on his remarkable accomplishment. This is the result of his unparalleled talent, hard work and unwavering determination.
His triumph has not only etched his name in the annals of chess history but has also inspired millions… https://t.co/fOqqPZLQlr pic.twitter.com/Xa1kPaiHdg
'నా విజయంలో అతిపెద్ద కీలక పాత్ర ఆయనదే' - Fide Candidates 2024 Gukesh
'ఆ ఓటమి వల్లే ఇప్పుడు గెలిచాను' : ఫిడే క్యాండిడేట్స్ విజేత గుకేశ్ - Fide Candidates 2024 winner