ETV Bharat / sports

వర్షం ఎఫెక్ట్ - గుజరాత్, కోల్​కతా మ్యాచ్ రద్దు - IPL 2024

GT Vs KKR IPL 2024 : ఐపీఎల్‌ 17వ సీజన్‌లో భాగంగా నేడు (మార్చి 13న) గుజరాత్ టైటాన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా ఆ మ్యాచ్​ రద్దయింది.

GT Vs KKR IPL 2024
GT Vs KKR IPL 2024 (Source : Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 13, 2024, 10:22 PM IST

Updated : May 13, 2024, 10:38 PM IST

GT Vs KKR IPL 2024 : ఐపీఎల్‌ 17వ సీజన్‌లో భాగంగా నేడు (మార్చి 13న) గుజరాత్ టైటాన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా ఆ మ్యాచ్​ రద్దయింది. అయితే రెండు జట్లకు చెరో పాయింట్ వచ్చింది.

సాయంత్రం నుంచే అహ్మదాబాద్‌లో వర్షం కురుస్తోంది. దీంతో అభిమానులు స్టాండ్స్​లో అలానే ఉండిపోయారు. సిబ్బంది కూడా మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. అంతే కాకుండా ప్లడ్ లైట్లలోని కొన్ని భాగాలు కూడా సమస్య తలెత్తడం వల్ల వాటిలో కొన్నింటినీ పూర్తిస్థాయిలో ఆన్‌ చేయలేదు.

అయితే గుజరాత్‌కు ఈ మ్యాచ్​ ఎంతో కీలకం. ఇందులో విజయం సాధిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఉన్నాయి. ఓడితే అధికారికంగా ఎలిమినేట్‌ అయినట్లే. కోల్‌కతా ఇప్పటికే ప్లే ఆఫ్స్‌నకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ జట్టు 18 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

ఇక గుజరాత్ ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడగా, అందులో 5 గెలిచింది. మిగతా 7 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. ప్రస్తుతం ఆ జట్టు చేతిలో 10 పాయింట్లు ఉన్నాయి. చెన్నైతో జరిగిన చివరి మ్యాచ్​లో గుజరాత్ ఘన విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌లు 210 పరుగుల భాగస్వామ్యం వల్ల ఆ జట్టు మంచి స్కోర్ చేసింది.

Last Updated : May 13, 2024, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.