Gautam Gambhir Team India Head Coach : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ త్వరలో భారత జట్టు కొత్త కోచ్‌గా నియమితులయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొత్త కోచ్ నియామకానికి సమయం దగ్గరపడుతున్న తరుణంలో బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) తాజాగా పలు ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో గంభీర్ కూడా మంగళవారం ఈ ఇంటర్వ్యూలకు వర్చువల్‌గా పాల్గొన్నాడు. దాదాపు 40 నిమిషాల పాటు సాగిన ఈ మీటింగ్‌లో గంభీర్‌ను అక్కడ మూడు కీలక ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఇంతకీ అవేంటంటే?
- జట్టు కోచింగ్ సిబ్బందికి సంబంధించి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి?
- బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కొంతమంది సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పుడు, జట్టులో మార్పులు చేయాలంటే ఆ పరిస్థితిని మీరు ఎలా ఎదుర్కొంటారు?
- ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్, వర్క్‌లోడ్‌కు అనుగుణంగా ఆటగాళ్ల ఫిట్‌నెస్ పరిమితులు, ఐసీసీ ట్రోఫీలు గెలవలేక జట్టు ఎదుర్కొంటున్న వైఫల్యాలను పరిష్కరించడం వంటి అంశాలపై మీ అభిప్రాయాలు ఏంటీ?
ఇలా మూడు ప్రశ్నలను కమిటీ సభ్యులు అడిగినట్లు తెలుస్తోంది. అయితే కోచ్ నియామకానికి సంబంధించిన ఇంటర్వ్యూలో గంభీర్ ఓ రౌండ్ పూర్తి చేశారు. రెండో రౌండ్ బుధవారం జరగనుంది.
ఇదిలా ఉండగా, కోచ్ పదవికి దరఖాస్తు చేసిన వారిలో నుంచి గంభీర్‌నే కాకుండా డబ్ల్యూవీ రామన్‌ను కూడా బీసీసీఐ తాజాగా ఇంటర్వ్యూకు పిలిచింది. వీరిద్దరూ కూడా వర్చువల్‌గానే హాజరయ్యారు. రామన్‌తోనూ సభ్యులు 40 నిమిషాల పాటు మాట్లాడారు. రెండో రౌండ్ కూడా పూర్తయ్యాక గంభీర్‌ను కోచ్‌గా ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయట.
కాగా, రామన్‌ను ఇంటర్వ్యూ చేసినప్పటికీ కూడా బీసీసీఐ గౌతమ్ గంభీర్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇకపోతే హెడ్ కోచ్ ఎంపికతో పాటు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ప్యానెల్‌కు కూడా కొత్త సెలెక్టర్‌ను ఎంపిక చేసే పనిలో ఉంది బీసీసీఐ. ఏదేమైనా రానున్న రోజుల్లో భారత క్రికెట్‌లో మరిన్ని గణనీయమైన మార్పుల కోసం బీసీసీఐ ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకుంటోందట. కొత్త కోచ్, సెలెక్టర్ నియామకాలు జట్టులో కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని భావిస్తోందట. దీంతో బీసీసీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందా అని క్రికెట్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
టీమ్ఇండియా హెడ్ కోచ్ రేసులో కొత్త పేరు - ఇంటర్వ్యూ కూడా చేశారట! - TeamIndia New Head Coach
ఫ్యాన్‌పై దాడికి దిగిన పాక్ క్రికెటర్ - భార్య ఆపినా కూడా! - Haris Rauf Pakistan Cricketer