Former Zimbabwe cricketer Attacked by Leopard : జింబాబ్వేకు చెందిన మాజీ క్రికెటర్ ఆల్ రౌండర్ గై విట్టాల్‌పై చిరుత దాడి చేసింది. అయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయన్ను పెంపుడు శునకం కాపాడింది. ఈ సంఘటనను వివరిస్తూ ఆ క్రికెటర్ సతీమణీ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
ఇంతకీ ఎలా జరిగిందంటే? - జింబాబ్వేకి చెందిన మాజీ ఆల్ రౌండర్ గై విట్టాల్ (Guy Whittall) వయసు 51 ఏళ్లు. ఆయన రీసెంట్‌గానే హ్యూమని ప్రాంతంలో ట్రెక్కింగ్‌కు వెళ్లారు. అప్పుడు తనతో పాటు పెంపుడు శునకం చికారాను కూడా వెంట తీసుకెళ్లారు గై విట్టాల్.
అయితే పర్వతారోహణ సమయంలో అకస్మాతుగా ఓ చిరుత విట్టాల్‌పై దాడికి దిగింది. దాని నుంచి తప్పించుకునేందుకు గై విట్టాల్ తీవ్రంగా ప్రయత్నించారు. అదే సమయంలో తన వెంటనే వచ్చిన చికారా కూడా అప్రమత్తమై తన యజమానిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలో అది కూడా తీవ్రంగా గాయపడింది. అయినప్పటికీ రక్తమోడుతూనే పోరాడి చిరుతను తరిమికొట్టింది. ఎట్టకేలకు తన యజమాని విట్టాల్‌ను రక్షించుకుంది. ఈ దాడిలో విట్టాల్ తీవ్రంగా గాయపడ్డాడు.ఆ వెంటనే విట్టాల్, చికారాను స్థానికులు, అధికారుల సాయంతో విమానంలో ఆస్పత్రికి తరలించారు.
ఈ విషయాన్ని విట్టాల్ భార్య హన్నా స్టూక్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఆ మూగజీవం ప్రస్తుతం కోలుకుంటోంది. తీవ్ర గాయాలు అవ్వడం వల్ల విట్టాల్‌కు సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉంది అని చెప్పుకొచ్చింది. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న విట్టాల్ ఫొటోను కూడా నెట్టింట్లో షేర్ చేసింది. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న విట్టాల్ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
కాగా, గతంలోనూ విట్టాల్ ఇలాంటి ఒక ఘటనను ఎదుర్కొన్నారు. 2013లో విట్టాల్ ఇంట్లోకి పెద్ద మొసలి దూరి మంచం కిందకు వెళ్లింది. దానిని ముందుగానే ఆయన గుర్తించారు. దీంతో ఆయనకు ప్రాణాపాయం తప్పినట్లు విట్టాల్ భార్య హన్నా స్టూక్స్ చెప్పుకొచ్చారు.
పాకిస్థాన్ స్టార్ మహిళా క్రికెటర్ షాకింగ్ డెసిషన్ - Bismah Maroof Retirement
చాహల్ భార్యను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఆమెను అలా అనుకున్నారుగా! - Yuzvendra Chahal Wife