ETV Bharat / sports

లైక్ ఫాదర్, లైక్ సన్- టీమ్ఇండియాకు ఆడిన తండ్రీకొడుకులు వీళ్లే! - Father And Son In Cricket - FATHER AND SON IN CRICKET

Father And Son In Cricket: క్రికెట్​లో జాతీయ జట్టుకు అన్నదమ్ములు ప్రాతినిధ్యం వహించడం సాధారణంగా తెలిసిందే. అయితే టీమ్ఇండియాకు తండ్రీ కొడుకులు కూడా ప్రాతినిధ్యం వహించారని మీకు తెలుసా?

Father And Son In Cricket
Father And Son In Cricket (Source: Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 1:47 PM IST

Father And Son In Cricket: దేశానికి ప్రాతినిథ్యం వహించడం ఓ అరుదైన గౌరవం. జాతీయ జట్టులో స్థానం సంపాదించి తనదైన ముద్ర వేయాలంటే దానికి కఠోరమైన శ్రమకు అదృష్టం కూడా తోడు కావాల్సి ఉంటుంది. అయితే రెండు తరాల క్రికెటర్లు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం అంతే తేలికైన విషయం కాదు. కానీ, భారత క్రికెట్‌లో తండ్రి-కుమారులు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించి ఔరా అనిపించారు. అలాంటి వారి గురించి తెలుసుకుందామా...?

పటౌడీల వారసత్వం: నవాబ్ మొహమ్మద్ ఇఫ్తికర్ అలీ ఖాన్ పటౌడీ భారత్‌ తరపున ఆరు టెస్ట్ మ్యాచులు ఆడాడు. మొదటి మూడు టెస్టులను ఇంగ్లాండ్‌ తరపున అలీఖాన్‌ ఆ తర్వాత మూడు టెస్టులను భారత్‌ తరపున ఆడాడు. 1932-34 సంవత్సరాల మధ్య ఇంగ్లాండ్‌ తరపున పటౌడీ టెస్టు మ్యాచులు ఆడాడు. ఆ తర్వాత భారత్‌ జట్టుకు మూడు టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించాడు. పటౌడీ 1946లో ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.

భారత్‌- ఇంగ్లాండ్ తరపున ఆడిన ఏకైక టెస్ట్ క్రికెటర్‌గా నిలిచాడు. ఇఫ్తికార్‌ పటౌడీ కుమారుడు మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ తండ్రి ఘన వారసత్వాన్ని కొనసాగించాడు. అలీ ఖాన్‌ పటౌడీ భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా పని చేశాడు. అతన్ని నవాబ్ ఆఫ్ పటౌడీ జూనియర్ అని పిలుస్తారు. పటౌడీ 46 టెస్టుల్లో 2739 పరుగులు చేశాడు.

అమర్‌నాథ్‌ ద్వయం: టీమ్​ఇండియాలోని దిగ్గజ ఆటగాళ్లలో లాలా అమర్‌నాథ్ ఒకరు. టెస్టు క్రికెట్​లో తొలి సెంచరీ కొట్టిన ఆటగాడిగా లాలా అమర్‌నాథ్‌ రికార్డు సృష్టించాడు. 24 టెస్టుల్లో టీమ్​ఇండియాకు లాలా అమర్‌నాథ్‌ ప్రాతినిథ్యం వహించి 878 పరుగులు చేశాడు. లాలా అమర్‌నాథ్ కుమారుడు మోహిందర్ అమర్‌నాథ్‌ కూడా భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 1983 వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో మోహిందర్‌ అమర్‌నాథ్‌ కీలక సభ్యుడిగా ఉన్నాడు. భారత్‌ తరపున మోహిందర్‌ అమర్‌నాథ్‌ 69 టెస్టులు, 85వన్డేలు ఆడాడు.

వినూ మన్కడ్- అశోక్ మన్కడ్: భారత్ తరఫున 44 టెస్టులకు వినూ మన్కడ్‌ ప్రాతినిథ్యం వహించాడు. ఇందులో వినూ మన్కడ్ 162 వికెట్లు తీశాడు. వినూ మన్కడ్‌ కుమారుడు అశోక్ మన్కడ్ కూడా భారత్‌ తరపున 22 టెస్ట్ మ్యాచ్​లు, ఒక వన్డే ఆడారు. టెస్టుల్లో 991 పరుగులు చేశాడు. వన్డేలో 44 పరుగులు చేశాడు.

విజయ్ మంజ్రేకర్- సంజయ్ మంజ్రేకర్: విజయ్ మంజ్రేకర్ 1952 -1965 మధ్య కాలంలో భారత్ జట్టు తరపున ఆడాడు. మొత్తం 55 టెస్ట్ లలో 3208 పరుగులు చేశాడు. విజయ్‌ కుమారుడు సంజయ్ మంజ్రేకర్ కూడా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. 37 టెస్టుల్లో 2043 పరుగులు, 74 వన్డేల్లో 1994 పరుగులు చేశాడు.

సునీల్ గావస్కర్ - రోహన్ గావస్కర్: భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ తన అద్భుతమైన కెరీర్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. 125 టెస్టులలో 10,122 పరుగులు, 108 వన్డేలలో 3092 పరుగులు చేశాడు. టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్లలో ఒకడిగా మాస్టర్‌ బ్లాస్టర్‌గా సునీల్‌ గావస్కర్‌ ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. సునీల్‌ గావస్కర్‌ కుమారుడు రోహన్ గావస్కర్ కూడా తండ్రి బాటలోనే ప్రయాణించినా ఆ స్థాయి ప్రదర్శన మాత్రం చేయలేదు. రోహిన్ గవాస్కర్‌ టీమ్ఇండియా తరపున 11 వన్డే లు ఆడి 151 పరుగులు చేశాడు.

రోజర్ బిన్నీ- స్టువర్ట్ బిన్నీ: ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్ని అతడి కుమారుడు స్టువర్ట్‌ బిన్ని కూడా భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు. రోజర్‌ బిన్ని భారత్ తరపున 27 టెస్ట్ మ్యాచులు ఆడి 47 వికెట్లు తీశాడు. 830 పరుగులు చేశాడు. 72 వన్డేలలో 77 వికెట్లు తీసి 629 పరుగులు చేశాడు. రోజర్ బిన్నీ కుమారుడు స్టువర్ట్ బిన్నీ 6 టెస్టు, 14 వన్డేలతో పాటూ 3 టీ 20 మ్యాచ్​లు ఆడాడు. 2015 ప్రపంచ కప్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు.

యువరాజ్‌ సింగ్‌- యోగ్‌రాజ్‌ సింగ్‌: టీమ్ఇండియా లెజెండరీ ఆల్‌రౌండర్‌, వరల్డ్‌కప్‌ విన్నర్‌ యువరాజ్‌ సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌. భారత్‌ తరఫున ఆరు వన్డేలు, ఓ టెస్టు మ్యాచ్‌ ఆడిన యోగ్‌రాజ్‌ క్రికెట్‌లో తాను సాధించలేని రికార్డులను తన కొడుకు ద్వారా సాకారం చేసుకున్నాడు.

క్రికెట్ హిస్టరీలో 'లాంగెస్ట్ టెస్టు'- 9రోజులు సాగిన ఆట - Longest Test Match

యువీకి అరుదైన గౌరవం- T20 వరల్డ్​కప్​ అంబాసిడర్​గా ఎంపిక - 2024 T20 World Cup

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.