ETV Bharat / sports

జేమ్స్ అండర్సన్ జర్నీ - ఈ రికార్డులు మరో పేసర్‌కు అసాధ్యమే! - James Anderson Records - JAMES ANDERSON RECORDS

James Anderson Retirement and Records : సమ్మరీ: 21 ఏళ్ల సుదీర్ఘ టెస్టు క్రికెట్‌ కెరీర్‌కు అండర్సన్‌ ముగింపు పలికాడు. ఎన్నో ఏళ్లుగా మోస్తున్న ఇంగ్లాండ్​ పేస్‌ దళం బాధ్యతలను వదిలేశాడు. ఈ సందర్భంగా అండర్సన్​ కెరీర్ రికార్డులను ఓ సారి పరిశీలిద్దాం.

source Associated Press
James Anderson (source Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 7:10 PM IST

James Anderson Retirement and Records : ఓ ఫాస్ట్‌ బౌలర్‌ సుదీర్ఘ కాలం క్రికెట్‌లో కొసాగడం చాలా అరుదు. చాలా మంది సూపర్‌ స్టార్‌లు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించేశారు. కానీ ఓ ప్లేయర్‌ 21 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాడు. అతనే జేమ్స్‌ అండర్సన్‌(41). లండన్‌లోని లార్డ్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టుతో శుక్రవారం కెరీర్‌కు ముగింపు పలికాడు. అతడి చివరి టెస్ట్ చూడటానికి, వీడ్కోలు పలకడానికి క్రికెట్ ఆఫ్ మక్కాగా పేర్కొనే లార్డ్స్‌కి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు.

చివరి టెస్టులో 4 వికెట్లు - ఇంగ్లాండ్​ వర్సెస్‌ వెస్టిండీస్‌ మూడు టెస్టుల సిరీస్‌ జులై 10న మొదలైంది. మొదటి టెస్టులో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్​ బౌలింగ్‌ ఎంచుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 121 పరుగులకే ఆలౌట్‌ అయింది. తన స్పెషల్‌ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్​లో అండర్సన్‌ 10 ఓవర్లలో 1 వికెట్‌ తీశాడు. అయితే అరంగేట్రం మ్యాచులో గుస్ అట్కిన్సన్ ఏకంగా 7 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్​ 371 పరుగులు చేసింది.

రెండో ఇన్నింగ్స్‌లో అండర్సన్ ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. 16 ఓవర్లు వేసిన అతను 32 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఓవర్ ది వికెట్, రౌండ్ ది వికెట్, ఇన్‌స్వింగ్, అవుట్‌స్వింగ్ అన్ని వేరియన్స్‌తో వెస్టిండీస్‌ను ముప్పతిప్పలు పెట్టాడు. 38 ఓవర్లో మొదటి బంతికి జాషువా డా సిల్వాని ఔట్‌ చేసి, తన కెరీర్‌లో చివరి వికెట్‌ పడగొట్టాడు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కడా అట్కిన్సన్‌ ఐదు వికెట్లు తీశాడు. చివరికి వెస్టిండీస్‌ 136 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఇన్నింగ్స్‌, 114 పరుగుల తేడాతో ఇంగ్లాండ్​ గెలిచింది.

అండర్సన్‌ కెరీర్‌ - 21 సంవత్సరాల కెరీర్‌లో 188 మ్యాచుల్లో మొత్తం 703 టెస్ట్ వికెట్లు సాధించాడు. క్రికెట్‌ హిస్టరీలో మరో ఫాస్ట్‌ బౌలర్‌కు సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకున్నాడు. అతను తన టెస్ట్ కెరీర్‌లో 109 మంది సహచరులతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నాడు. చివరిగా వెస్టిండీస్‌పై విజయంతో టెస్ట్‌ కెరీక్‌కి వీడ్కోలు పలికాడు.

ఈ రైట్ ఆర్మ్ పేసర్ 2002లో ఆస్ట్రేలియాపై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. 2003లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో తన తొలి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. మార్క్ వెర్మీలెన్ అతని తొలి టెస్టు వికెట్ కావడం గమనార్హం.

మొదటి ఐదు సంవత్సరాలు, అంటే 2007 వరకు ఆండర్సన్ జట్టులోకి వస్తూ పోతూ ఉన్నాడు. 2003 వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై అద్భుతమైన స్పెల్ వేసినా, జట్టులో సుస్థిర స్థానం దక్కలేదు. కానీ 2007 తర్వాత కొత్త అండర్సన్‌ కనిపించాడు. కొత్త బంతితో మైదానంలో విధ్వంసం సృష్టించాడు. 22 గజాల పిచ్‌పై ఆధిపత్యం చెలాయించాడు. అతని ప్రారంభ సంవత్సరాల్లో, కోచింగ్ మేనేజ్‌మెంట్ అండర్సన్ బౌలింగ్ యాక్షన్‌ను కొద్దిగా సర్దుబాటు చేసింది. దీంతో అతడు విశ్వాసం, ఫామ్‌ కోల్పోయాడు. తర్వాత రీఫార్మడ్‌ యాక్షన్‌తో అండర్సన్‌ అడుగుపెట్టాడు. తిరిగి లయ అందుకున్నాడు.

2008 వెల్లింగ్‌టన్ టెస్ట్ అండర్సన్ కెరీర్‌లో ప్రత్యేకం. ప్లేయింగ్ 11లో మాథ్యూ హోగార్డ్ ప్లేస్‌లో జట్టులోకి వచ్చిన అండర్సన్‌ ఐదు వికెట్లతో అదరగొట్టాడు. తర్వాత ఏడు టెస్టుల్లో 34 వికెట్లు పడగొట్టాడు. తక్కువ కాలంలోనే ఇంగ్లీష్ పేస్ దళానికి నాయకుడిగా మారాడు. 2008 సమ్మర్, 2013/14 ఆస్ట్రేలియా పర్యటన మధ్య అండర్సన్ 70 టెస్టుల్లో 273 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత పదేళ్లపాటు ఇంగ్లాండ్​కు ప్రధాన అస్త్రంగా మారాడు. 95 మ్యాచుల్లో 357 వికెట్లు పడగొట్టాడు

స్వల్ప స్వింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టడం ప్రారంభించిన యువ పేస్ బౌలర్, ఆఖరికి బంతిని రెండువైపులా స్వింగ్ చేయడంలో నైపుణ్యం సాధించాడు. అలాగే, పాత బంతిని రివర్స్ చేసే టాలెంట్​ను మెరుగుపరుచుకున్నాడు. ఫైనల్​గా పూర్తి ఫాస్ట్ బౌలర్‌గా మారడానికి తన వైవిధ్యమైన అస్త్రాలను ఊపయోగించి కెరీర్​లో దూసుకెళ్లాడు.

వన్డేల్లోనూ అతనే టాప్‌ - టెస్టుల్లోనే కాకుండా వన్డేల్లో కూడా అండర్స్‌ రాణించాడు. ఇంగ్లాండ్​ తరఫున అత్యధిక వన్డే వికెట్లు తీసిన రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. 194 వన్డేల్లో 269 వికెట్లు తీశాడు. 2015లో ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచులో వన్డేలకు వీడ్కోలు పలికాడు.

అరుదైన రికార్డులు - జేమ్స్ ఆండర్సన్ పేరిట కొన్ని అరుదైన రికార్డులు ఉన్నాయి. సచిన్‌ తెందూల్కర్‌ తర్వాత అత్యధిక టెస్టులు ఆడిన ప్లేయర్‌(188)గా నిలిచాడు. వికెట్‌ కీపర్‌ క్యాచ్‌ ద్వారా అత్యధిక వికెట్లు (198) తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్‌ చేశాడు. టెస్టుల్లో 700 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా చరిత్ర సృష్టించాడు. భారత్‌పై అత్యధిక వికెట్లు కేవలం 39 మ్యాచ్‌ల్లో 149 వికెట్లు తీశాడు. అలాగే భారత్‌లో అత్యధిక వికెట్లు (45) పడగొట్టాడు.

విజయంతో కెరీర్ ముగించిన జేమ్స్ అండర్సన్

ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది? క్రికెట్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? - First International Cricket Match

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.