ETV Bharat / sports

క్రికెట్​కు అండర్సన్ గుడ్​బై- 20ఏళ్ల కెరీర్​కు ఫుల్​స్టాప్! - James Anderson Retirement - JAMES ANDERSON RETIREMENT

James Anderson Retirement: ఇంగ్లాండ్ స్టార్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్​కు శనివారం రిటైర్మెంట్ ప్రకటించాడు.

James Anderson Retirement
James Anderson Retirement (Source: Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : May 11, 2024, 5:35 PM IST

Updated : May 11, 2024, 6:16 PM IST

James Anderson Retirement: ఇంగ్లాండ్ స్టార్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్​కు శనివారం రిటైర్మెంట్ ప్రకటించాడు. 41ఏళ్ల అండర్సన్ జులై 10న లార్డ్స్ మైదానం వేదికగా వెస్టిండీస్​తో జరగనున్న టెస్టుతో తన క్రికెట్ కెరీర్ ముగియనున్నట్లు చెప్పాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు.

'ఈ వేసవిలో లార్డ్స్​ వేదికగా ఆడనున్న తొలి టెస్ట్ నా కెరీర్​లో ఆఖరి మ్యాచ్ కానుంది. ఈ 20ఏళ్లుగా నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. దేశానికి ఆడడం కంటే పెద్ద కల ఇంకోటి లేదు. నా కెరీర్​లో నాకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, నా కోచ్​లు, సహచర ప్లేయర్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక క్రికెట్ నుంచి తప్పుకొని ఇతరులకు అవకాశం కల్పించేందుకు ఇదే సరైన సమయం అనుకుంటున్నాను' అని అండర్సన్ అన్నాడు.

ఇక 2003లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అండర్సన్ గత 20 ఏళ్లుగా ఇంగ్లాండ్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. టెస్టుల్లో 700 వికెట్లు పడగొట్టిన తొలి ఇంగ్లాండ్ బౌలర్​గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 187 టెస్టుల్లో ఏకంగా 700 వికెట్లు పడగొట్టాడు. అందులో 32సార్లు 5వికెట్లు, 23సార్లు 10వికెట్ల ప్రదర్శన చేశాడు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో 700 వికెట్లు నేలకూల్చిన తొలి పేసర్​గా కూడా రికార్డు కొట్టాడు. ఇక ఓవరాల్​గా టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్​గా కొనసాగుతున్నాడు.

ఈ లిస్ట్​లో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరణ్ 800 వికెట్లతో టాప్​లో ఉండగా, ఆస్ట్రేలియా లెజెండ్ బౌలర్ షేన్ వార్న్ 708తో రెండో స్థానంలో ఉన్నాడు. టెస్టుల్లోనే కాకుండా వన్డేల్లోనూ అండర్సన్ తన మార్క్ చూపించాడు. కెరీర్​లో 194 వన్డే మ్యాచ్​లు ఆడిన అండర్సన్ 269 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఇక 19 టీ20 మ్యాచ్​ల్లో 18 వికెట్లు తీశాడు. ఓవరాల్​గా 400 అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడిన అండర్సన్ అన్ని ఫార్మాట్లలో కలిపి 987 వికెట్లు కూల్చాడు.

అండర్సన్​ @ 700: టెస్టుల్లో తొలి పేసర్​గా రికార్డ్- సచిన్ స్పెషల్ ట్వీట్

అండర్సన్ అరుదైన ఘనత- 72 ఏళ్ల రికార్డ్ బ్రేక్

Last Updated : May 11, 2024, 6:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.