ETV Bharat / sports

ఇంగ్లాండ్ బ్యాటర్ షాకింగ్ డెసిషన్- అరంగేట్రం చేసిన 7ఏళ్లకే కెరీర్​కు గుడ్​బై - Dawid Malan Retirement

Dawid Malan Retirement: ఇంగ్లాండ్ డాషింగ్ బ్యాటర్ డేవిడ్ మలన్ ఇంటర్నేషనల్ క్రికెట్​కు గుడ్​బై చెప్పాడు.

Dawid Malan Retirement
Dawid Malan Retirement (Source: Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 28, 2024, 2:55 PM IST

Dawid Malan Retirement: ఇంగ్లాండ్ డాషింగ్ బ్యాటర్ డేవిడ్ మలన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్​కు బుధవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడు చివరగా 2023 వన్డే వరల్డ్​కప్​లో ఆడాడు. మలన్ కెరీర్​లో 22టెస్టు, 30 వన్డే, 62 టీ20 మ్యాచ్​ల్లో ఇంగ్లాండ్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ సాధించిన అతి తక్కువ ఇంగ్లాండ్ బ్యాటర్లలో మలన్ ఒకడు. అయితే 2017లో ఇంటర్నేషనల్ అరంగేట్రం చేసిన మలన్ కేవలం 7 ఏళ్లలోనే కెరీర్​కు వీడ్కోలు పకలడం గమనార్హం.

టీ20ల్లో భేష్
అంతర్జాతీయ క్రికెట్​లోకి డేవిడ్ మలన్ పొట్టి ఫార్మాట్​తోనే ఎంట్రీ ఇచ్చాడు. ఆడిన తొలి మ్యాచ్​లోనే సౌతాఫ్రికాపై భారీ ఇన్నింగ్స్​తో (78 పరుగులు 44 బంతుల్లో) సత్తా చాటాడు. ఆ తర్వాత కూడా అదే దూకుడుతో కేవలం 24 ఇన్నింగ్స్​ల్లోనే 1000 పరుగులు పూర్తి చేశాడు. ఈ క్రమంలో పరుషుల టీ20 క్రికెట్​లో అతి తక్కువ ఇన్నింగ్స్​లో ఈ మైలురాయి అందుకున్న ప్లేయర్​గా రికార్డు సృష్టించాడు. ఇక 2020 నవంబర్​లో టీ20 ర్యాంకింగ్స్​లో నెం.1 స్థానానికి చేరుకున్నాడు. అలాగే 2022 టీ20 వరల్డ్​కప్ నెగ్గిన ఇంగ్లాండ్ జట్టులో మలన్ సభ్యుడిగా ఉన్నాడు. ఓవరాల్​గా ఇప్పటివరకు పొట్టి ఫార్మాట్​లో 62మ్యాచ్​ల్లో మలన్ 132.49 స్ట్రైక్​ రేట్​తో 1892 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

వన్డే, టెస్టుల్లో ఇలా
టెస్టు, వన్డేల్లోనూ ఫర్వాలేదనిపించాడు. ఆడింది తక్కువ మ్యాచ్​లే అయినా తన మార్క్ ఆటతో అలరించాడు. టెస్టుల్లో 1074 (1 సెంచరీ), వన్డేల్లో 1450 (6 సెంచరీలు) పరుగులు చేశాడు. 'నేను మూడు ఫార్మాట్‌లను చాలా సీరియస్‌గా తీసుకున్నాను. కానీ టెస్టు క్రికెట్ కాస్త భిన్నంగా ఉంటుంది. దాని కోసం 5రోజులు శ్రమించాల్సి ఉంటుంది. నేను ఓ ట్రెయినర్. హార్డ్ హిట్టింగ్ చేయడమే ట్రైనింగ్​లో నేర్చుకుంటా. అయితే టెస్టు ఫార్మాట్​లో పెద్దగా రాణించలేకపోవడంతో కాస్త నిరాశ చెందాను' అని మలన్ రిటైర్మెంట్ సందర్భంగా యూకే మీడియాతో అన్నాడు. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్​కు గుడ్​బై చెప్పిన మలన్, డొమెస్టిక్ టోర్నీల్లో కొనసాగే ఛాన్స్ ఉంది.

David Malan Century World Cup 2023 : డేవిడ్ మలన్ విధ్వంసకర శతకం.. జో రూట్‌ ఆల్‌టైం రికార్డ్​ బ్రేక్‌

IPL 2021: ఐపీఎల్​ నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.