ETV Bharat / sports

ఇంగ్లాండ్ @ 500000 పరుగులు- ప్రపంచంలోనే ఏకైక జట్టుగా రికార్డ్ - ENGLAND TEST RECORD

అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన ఇంగ్లాండ్- ప్రపంచంలోనే ఏకైక జట్టు!

England Test Record
England Test Record (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Dec 7, 2024, 11:08 AM IST

England Test Record : ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. 147ఏళ్ల టెస్టు హిస్టరీలో 5 లక్షల పరుగుల మార్క్ క్రాస్ చేసిన తొలి జట్టుగా నిలిచింది. న్యూజిలాండ్​తో జరుగుతున్న రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్ ఈ మైలురాయి అందుకుంది. 1082 మ్యాచ్​ల్లో ఇంగ్లాండ్ ఇప్పటివరకు 500000+ పరుగులు చేసింది. ఇంగ్లాండ్​ టెస్టు హిస్టరీలో 1082 మ్యాచ్​ల్లో 399 విజయాలు నమోదు చేయగా, 355 డ్రా చేసుకుంది. 327 మ్యాచ్​ల్లో ఓడింది.

ఇంగ్లాండ్ తర్వాత ఈ లిస్ట్​లో రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. ఆసీస్​ 4 లక్షల 28 వేల పైచిలుకు పరుగులు చేసింది. టీమ్ఇండియా 2 లక్షల 78వేల పైచిలుకు పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతోంది.

అందులోనూ ఇంగ్లాండే టాప్
ఇంగ్లాండ్ బ్యాటర్లంతా కలిపి టెస్టుల్లో ఇప్పటివరకు 929 సెంచరీలు బాదారు. అత్యధికంగా జో రూట్ 35 శతకాలతో టాప్​లో ఉన్నాడు. ఇక ఆస్ట్రేలియా ప్లేయర్లంతా కలిసి 592 సెంచరీలు బాదగా, టీమ్ఇండియా ఆటగాళ్లు 552 శతకాలతో మూడో స్థానంలో ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.