ENG VS USA T20 World Cup 2024 : టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా జరుగుతున్న సూపర్-8 పోరులో అమెరికాపై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. 116 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లలో ఛేదించి గెలుపొందింది. దీంతో సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది.
అయితే ఈ కీలక మ్యాచ్‌లో ఇంగ్లిష్ జట్టు బౌలర్లు క్రిస్ జోర్డాన్ అదరగొట్టాడు. 9 ఓవర్‌లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి రికార్డుకెక్కాడు. ఇందులో ఓ హ్యాట్రిక్ ఉండటం విశేషం. ఇది కాకుండా ఇలా ఈ టోర్నీలో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన తొలి ఇంగ్లాండ్ ప్లేయర్ కూడా జోర్డనే.
హ్యాట్రిక్ విశేషాలు ఇవే
జోర్డాన్ వేసిన 19 ఓవర్లో మొదట బంతికి కోరె అండర్సన్ హ్యారీ బ్రూక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాతి బంతికి ఒక్క పరుగు కూడా రాలేదు. అయితే ఆ తర్వాత వేసిన మూడు బంతులకు వరుసగా అలీ ఖాన్ (0) క్లీన్‌బౌల్డ్, నోస్తుష్ కెంజిగే (0) ఎల్బీడబ్ల్యూ, సౌరభ్ నేత్రావల్కర్ (0) క్లీన్‌బౌల్డ్ అయ్యారు. దీంతో క్రిస్ జోర్డాన్ హ్యాట్రిక్ సాధించాడు. అయితే ఈ ప్రపంచకప్‌లో ఇది మూడో హ్యాట్రిక్ కావడం విశేషం. కానీ ఇప్పటికే ఆస్ట్రేలియా పేసర్ కమిన్స్ రెండుసార్లు హ్యాట్రిక్ సాధించి ఈ రికార్డులో టాప్ పొజిషన్‌ను చేజిక్కించుకున్నాడు.
ఇక ఈ మ్యాచ్‌లో యూఎస్ బ్యాటర్లు ఆచీతూచి ఆడినప్పటికీ క్రమక్రమంగా ఇంగ్లీష్ బౌలర్లకు చిక్కుతూ వచ్చారు. ఓపెనర్లు స్టీవెన్ టేలర్ (12), ఆంద్రీస్ గౌస్ (8)తోపాటు కెప్టెన్ ఆరోన్ జోన్స్ (10), మిలింద్ కుమార్ (4) నిరాశపర్చారు. నితీశ్ కుమార్ (30), కోరె అండర్సన్ (29) హర్మన్‌ప్రీత్ సింగ్ (21), ఫర్వాలేదనిపించారు. అదిల్ రషీద్ (2/13) పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కరన్ 2, లివింగ్‌స్టోన్, రీస్ టాప్లీ చెరో వికెట్ పడగొట్టారు.
యూఎస్ (తుది జట్టు) : ఆరోన్ జోన్స్(కెప్టెన్), స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్(వికెట్ కీపర్), నితీష్ కుమార్, కోరీ అండర్సన్, మిలింద్ కుమార్, హర్మీత్ సింగ్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, నోస్తుష్ కెంజిగే, అలీ ఖాన్, సౌరభ్ నేత్రవల్కర్
ఇంగ్లాండ్ (తుది జట్టు) : ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కెప్టెన్, వికెట్ కీపర్), జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ.
ఇంట్రెస్టింగ్గా వరల్డ్‌కప్ సెమీస్ రేస్- భారత్‌కు ఛాన్స్ ఎంతంటే?