ETV Bharat / sports

'అది నేను డిసైడ్ చెయ్యను'- అయ్యర్, ఇషాన్ ఫ్యూచర్​ కెరీర్​పై ద్రవిడ్ - Dravid On Ishan Kishan Iyer

Dravid On Ishan Kishan Iyer: టీమ్ఇండియా యంగ్ ప్లేయర్లు ఇషాన్ కిషన్‌, శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్​ విషయంపై కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడాడు. ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్ అనంతరం మీడియాలో మాట్లాడిన ద్రవిడ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

Dravid On Ishan Kishan Iyer
Dravid On Ishan Kishan Iyer
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 10, 2024, 6:52 AM IST

Updated : Mar 10, 2024, 8:42 AM IST

Dravid On Ishan Kishan Iyer: టీమ్ఇండియా సొంత గడ్డపై ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టు సిరీస్​లో చెలరేగిపోయింది. బజ్​బాల్ వ్యూహానికి చెక్​ పెడుతూ ఐదు మ్యాచ్​ల సిరీస్​ను ​4-1తో కైవసం చేసుకుంది. ఇక ధర్మశాలలో చివరి మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రెస్​మీట్​లో పాల్గొన్నాడు. ఈ మీట్​లో ఇషాన్ కిషన్‌, శ్రేయస్ అయ్యర్ ఫ్యూచర్ కెరీర్​, వారి సెంట్రల్ కాంట్రాక్ట్ గురించి ద్రవిడ్​ను అడగ్గా రిప్లై ఇచ్చాడు.

'సెంట్రల్ కాంట్రాక్ట్​లు నేను డిసైడ్ చేయను. కనీసం అది ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారో కూడా నాకు తెలీదు. ఆ ఇద్దరూ క్రికెట్ ఆడడం కొనసాగిస్తారని అనుకుంటున్నా. వాళ్లు పూర్తి ఫిట్​నెస్​తో సెలెక్టర్లకు అందుబాటులో ఉండాలి. ఇక తుది జట్టులోను మాత్రం నేను, రోహిత్ కలిసి ఎంపిక చేస్తాం. ప్లేయర్​తో సంబంధం లేకుండా, వారి ఆటతీరును బట్టే వారిని జట్టులోకి తీసుకుంటాం. అందులో ఎవరు కాంట్రాక్ట్​లో ఉన్నారు, ఎవరు లేరు? అనే విషయం కూడా నాకు తెలీదు. అందుకే కాంట్రాక్ట్​లో లేని ప్లేయర్లు కూడా టీమ్ఇండియాకు ఎంపికయ్యే ఛాన్స్ ఉంది' అని రాహుల్ అన్నాడు.

టెస్టు ప్లేయర్లకు బంపర్ ఆఫర్?: టీమ్ఇండియా ఆటగాళ్లకు రీసెంట్​గా బీసీసీఐ గుడ్​న్యూస్ చెప్పింది. పురుషులకు టెస్టు ఫార్మాట్​ మ్యాచ్ ఫీజు పెంచనున్నట్లు బోర్డు సెక్రటరీ జై షా శనివారం వెల్లడించారు. ఆటగాళ్ల ఆర్ధిక స్థిరత్వాన్ని దృఢపర్చేందుకు 'టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్' పేరిట అదనపు ఫీజు చెల్లించాలని బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు షా తెలిపారు. ఈ ఇన్సెంటివ్ స్కీంతో ఆయా ప్లేయర్​కు అత్యధికంగా ఒక్కో మ్యాచ్​కు రూ.45 లక్షల దాకా ఫీజు రూపంలో అందనుంది. ఇది 2022-23 సంవత్సరం నుంచే అమలైనట్లు షా పేర్కొన్నారు.

ఫీజు వివరాలు: ఒక సంవత్సర కాలంలో భారత్ 9 మ్యాచ్​లు ఆడుతుందని అనుకుంటే, అందులో 4 టెస్టు​లకంటే తక్కువ ఆడిన ప్లేయర్లకు ఈ ఇన్సెంటివ్ వర్తించదు. 50 శాతం అంటే 5-6 మ్యాచ్​లు ఆడిన ప్లేయర్ రూ.30 లక్షలు అందుకుంటాడు. సిరీస్​కు ఎంపికై తుది జట్టులో లేకపోయినా రూ.15 లక్షలు దక్కుతాయి. ఇక 7 అంతకంటే ఎక్కువ (75 శాతం) మ్యాచ్​లు ఆడిన ఆటగాడికి బీసీసీఐ అత్యధికంగా రూ.45 లక్షలు చెల్లించనుంది. ఇందులో కూడా బెంచ్​కు పరిమితమైనా రూ.22.50 లక్షలు అందుకుంటారు. కాగా, ప్రస్తుతం ఒక్కో టెస్టు మ్యాచ్​కు బేసిక్ ఫీజు రూ.15 లక్షలు ఉంది.

ఇంగ్లాండ్​పై భారత్ గ్రాండ్ విక్టరీ- ఈ మ్యాచ్​లో రికార్డులు ఇవే!

అండర్సన్​ @ 700: టెస్టుల్లో తొలి పేసర్​గా రికార్డ్- సచిన్ స్పెషల్ ట్వీట్

Last Updated : Mar 10, 2024, 8:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.