ETV Bharat / sports

DK సక్సెస్​లో 'ఆమె'- దినేశ్, దీపిక బ్యూటిఫుల్ లవ్​స్టోరీ - Dinesh Karthik Love Story

Dinesh Karthik Love Story: క్రికెట్​లో అట్రాక్ట్​ఫుల్ కపుల్​లో దినేశ్ కార్తిక్- దీపికా పళ్లికల్ జంట ఒకటి. అయితే కెరీర్​ పరంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దినేశ్ జీవితంలోకి వచ్చిన దీపిక అతడి సక్సెస్​ లైఫ్​​లో కీలకంగా వ్యవహరించింది. మరి ఆ జంట లవ్​ స్టోరీ మీకు తెలుసా?

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 20, 2024, 1:17 PM IST

Dinesh Karthik Love Story: టీమ్ఇండియా సీనియర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్​లో ఉన్నాడు. 2024 ఐపీఎల్​లో ఆర్సీబీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న దినేశ్ ఇప్పటికే 226 పరుగులతో సత్తా చాటాడు. గత మ్యాచ్​లో సన్​రైజర్స్​తో మ్యాచ్​లో భారీ లక్ష్య ఛేదనలో దినేశ్ (83 పరుగులు, 35 బంతుల్లో) పోరాడిన తీరు అద్భుతం. ఈ ఇన్నింగ్స్​ తర్వాత దినేశ్​ను 2024 వరల్డ్​కప్​నకు ఎంపిక చేయాలంటూ పలువురు మాజీలు, క్రికెట్ ఎక్స్​పర్ట్స్​ అభిప్రాయ పడుతున్నారు. దీంతో రెండేళ్లు టీమ్ఇండియాకు దూరంగా ఉన్న దినేశ్ రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.

అయితే జాతీయ జట్టులో స్థానం కోల్పోవడం, ఐపీఎల్​ పెర్ఫార్మెన్స్​తో రీఎంట్రీ ఇవ్వడం కొత్తేం కాదు. కెరీర్​లో ఒడుదొడుకులు ఎదుర్కొన్న దినేశ్ మళ్లీ ఫామ్​లోకి రావడం కారణం అతడి ప్రేమ. ఫామ్ లేక జట్టులో ప్లేస్ కోల్పోయిన దగ్గర్నుంచి పలువురికి ఆదర్శంగా మారేంత వరకు కార్తిక్‌కు అండగా నిలిచింది ప్రేమే. అవును ఆ ప్రేమ వల్లే ఎన్నో కష్టాలను దినేశ్ కార్తిక్‌ అధిగమించాడు. ఇప్పుడు కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న కార్తిక్‌ ప్రేమ కథ ఓ స్ఫూర్తి మంత్రం. మరి దినేశ్ కెరీర్​, ప్రేమ కథ లోతును మనమూ తెలుసుకుందామా?

చెన్నైలో తెలుగు కుటుంబంలో జన్మించిన దినేశ్ 10 సంవత్సరాల వయస్సులోనే క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. అన్ని ఫార్మాట్​ల క్రికెట్ ఆడిన DK ప్రస్తుతం తమిళనాడు క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఐపీఎల్​లో ముంబయి, కోల్​కతా, ఆర్సీబీ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అలా ఒక్కోమెట్టు ఎక్కుతూ కెరీర్​లో ఎదిగాడు. కెరీర్​ పీక్స్​లో ఉన్న సమయంలో వ్యక్తిగత విషయాల వల్ల దినేశ్ తన కెరీర్​లో ఒక్కసారిగా కింద పడిపోయాడు! తన మొదటి భార్య విషయంలో దినేశ్ చాలా డిస్ట్రబ్ అయ్యాడు. దీని ప్రభావం ఆటపై పడి దినేశ్ రాణించలేకపోయాడు. కెరీర్​లో కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు.

దినేశ్- దీపిక లవ్: కొంతకాలం తర్వాత ఈ విషయం నుంచి కోలుకోడానికి దినేశ్ మళ్లీ జిమ్ బాట పట్టాడు. అక్కడే దినేశ్​కు దీపికా పళ్లికల్ పరిచమైంది. దీపిక మహిళల ఇండియన్ స్క్వాష్ ఛాంపియన్. 2013లో, ఒక టోర్నమెంట్ సమయంలో ఆమెను కలవడానికి భారతదేశం నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లాడు. అదే సంవత్సరం దినేశ్ దీపికకు ప్రపోజ్ చేశాడు. ఆమె అంగీకరించిన తర్వాత, వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తర్వాత ఆమె ప్రోత్సాహంతో దినేశ్ మళ్లీ క్రికెట్​పై దృష్టి సారించి నేడు ఛాంపియన్​గా ఎదిగాడు. తన వ్యక్తిగత జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, ఆటపై తనకున్న మక్కువతో సత్తా నిరూపించుకున్నాడు.

ఐపీఎల్ చరిత్రలో 150 అవుట్‌లను పూర్తి చేసిన రెండో వికెట్ కీపర్‌గా నిలిచాడు. ప్రస్తుతం దినేశ్ఆర్సీబీ తరఫున మ్యాచ్ ఆడుతుంటే.. దీపిక డగౌట్ నుంచి ప్రోత్సహిస్తూ.. ఉత్సహాన్నిస్తోంది. ఈ ప్రోత్సాహమే దినేశ్‌ కార్తీక్‌ను పాతాళం నుంచి పతాకస్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు ఇంకా ముందుకు తీసుకెళ్లేలా చేస్తోంది. అందుకే హ్యాట్సాఫ్‌ దీపిక.

'నన్ను, నా ఫ్యామిలీని చాలాసార్లు తిట్టారు'- RCB ఫ్యాన్స్​పై డీకే షాకింగ్ కామెంట్స్ - Dinesh Karthik On Rcb Fans

వెకేషన్ మోడ్​లో దినేశ్​ కార్తిక్.. డిస్నీల్యాండ్​లో సందడి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.