ETV Bharat / sports

'ధోనీయే కరెక్ట్' - మరోసారి ట్రెండింగ్​లోకి DRS - Dhoni Review System - DHONI REVIEW SYSTEM

Dhoni Review System : చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ధోనీకి ఫ్యాన్స్​లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మ్యాచ్​లో అతడి ఆటతీరుకు ఫిదా అయ్యే ఫ్యాన్స్ తాను ఏ డెసిషన్​ తీసుకున్న అదే సరైనదే అని నమ్ముతారు. తాజాగా ఈ విషయం మరోసారి నిరూపితమైంది. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Dhoni Review System
Dhoni Review System
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 24, 2024, 1:26 PM IST

Dhoni Review System : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ ధోనీ అంటే అందరికీ గుర్తొచ్చేది హెలికాప్టర్ షాట్. అది ఒక్కప్పటి కథ. ఇప్పుడైతే అందరికీ ధోనీ రివ్యూ సిస్టమే గుర్తొస్తుంది. ధోనీ ఫీల్డింగ్​లోకి దిగాడంటే ఇక అంతే. అంపైర్ రాంగ్​ డెసిషన్​ కూడా డీఆర్ఎస్​లో కరెక్ట్ అయిపోతుంది. అంతటి పవర్ ఉంది దానికి. అందుకే ఈ మిస్టర్ కూల్ ఎప్పుడూ ఈ నిర్ణయం తీసుకున్న కూడా తన టీమ్ మేట్స్​తో పాటు ఫ్యాన్స్ కూడా అతడి మాటకు సపోర్ట్ చేస్తుంటారు. అయితే తాజాగా ఈ రివ్యూ సిస్టమ్​ మరోసారి నెట్టింట ట్రెండ్ అయ్యింది. ఇంతకీ ఏం జరిగిందంటే ?

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా లఖ్​నవూ సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్​ 13వ ఓవ‌ర్‌లో తుషార్ దేశ్‌పాండే బౌలింగ్ చేశాడు. అయితే మార్కస్ స్టోయినిస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అంపైర్ వైడ్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఆ బంతికి ధోనీ రివ్యూ తీసుకున్నాడు. అయితే ఆ రివ్యూ స‌రైనదే అని తేలింది. దీంతో అంపైర్ వెంటనే తన వైడ్ కాల్‌ను రివ‌ర్స్ చేశాడు. ఇది చూసి ఫ్యాన్స్ ధోనీయే కరెక్ట్ అంటూ హోరెత్తారు. నెట్టింట మీమ్స్​తో ఈ రివ్యూను ట్రెండ్ చేస్తున్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్​లో లఖ్​నవూ సూపర్​ జెయింట్స్ అద్భుత విజయం సాధించింది. మార్కస్ స్టొయినిస్​ (124​*) ఒక్కడే మొదటి నుంచి చివరి వరకు క్రీడులో ఉండి ఒంటి చేత్తో మ్యాచ్​ను గెలిపించాడు. లాస్ట్ ఓవర్​లో చివరి మూడు బంతుల్లో విజయానికి మూడు పరుగులు అవసరమయ్యాయి. అయినా స్టొయినిస్​ ఒత్తిడిలోనూ బంతిని బాది మ్యాచ్​ను ముగించాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్​పై 6 వికెట్ల తేడాతో లఖ్​నవూ విజయం సాధించింది. అలా 211 పరుగుల లక్ష్యాన్ని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొత్తంగా 213 పరుగులు చేసింది.

ఇక లఖ్​నవూ ఇన్నింగ్స్​లో చివర్లో వచ్చిన దీపక్ హోడా(17*​) కూడా మంచి స్కోరే చేశాడు. మిగతా వారిలో దేవదత్ పడిక్కల్​(13), నికోలస్ పూరన్​(34), కేఎల్ రాహుల్​(16) రన్స్​ చేశారు. మతీశా పతిరణ 2, ముస్తాఫిజుల్ రెహ్మాన్​, దీపక్ చాహర్ తలో వికెట్ దక్కించుకున్నారు.

'టీ20ల్లో బౌలర్లు ఇబ్బందులు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం అదే' - IPL 2024

'నేనెప్పుడు అలా వినలేదు'​ - ధోనీ క్రేజ్​పై సన్​రైజర్స్​ కమిన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! - IPL 2024 CSK VS SRH

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.