Dhoni CSK Tweet : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన క్రికెట్‌ను వదిలిపెట్టి చాలా కాలం అయినప్పటికీ ఇప్పుడు కూడా ధోనీ పేరు చెప్తే ఫ్యాన్స్ సంతోషంతో ఉప్పొంగిపోతారు. తలైవా అంటూ హోరెత్తిపోతుంటారు. ఇక ఐపీఎల్లో ధోనీ ఆటను తిలకించేందుకు బారులు తీరే అభిమాన ప్రవాహాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు. చెన్నై మ్యాచ్ అంటే చాలు ఇక స్టేడియం మొత్తం యెల్లో మయం అయిపోతుంది. ఇప్పటి వరకు కెప్టెన్‌గా ఉండి జట్టుకు కీలక విజయాలను అందించాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న సీజన్‌కు ఆయన తన కెప్టెన్సీని వదిలివేసి అతడు వికెట్ కీపర్, బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.
ధోనీ కెప్టెన్సీ వదులుకున్నాడన్న నిరాశలో ఉన్న అభిమానులకు తాజాగా ఈ కెప్టెన్ కూల్ ఓ మరిచిపోలేని సర్పైజ్ ఇచ్చాడు. ఆదివారం వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ఫోర్లు సిక్సర్లు బాదుతూ పాత ధోనీని గుర్తు చేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ చేతిలో చెన్నై ఓటమి చవి చూసింది. అయితే మ్యాచ్ ఓడిపోయినందుకు తొలిసారి చెన్నై అభిమానులు సంతోషంగా ఉన్నారు.
ఆ ట్వీట్ ఇప్పుడు మరోసారి వైరల్
దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ 16 బంతులను ఎదుర్కొన్నాడు. అందులో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 37 పరుగులు స్కోర్ చేశాడు. చివరిగా వచ్చినప్పటికీ తనదైన స్టైల్లో వండర్ఫుల్ షాట్స్ ఆడి మెరుపులు మెరిపించాడు. దీంతో ఈ ఇన్నింగ్స్ తర్వాత ధోనీ 10 ఏళ్ల క్రితం సోషల్ మీడియాలో చేసిన ఓ ట్వీట్త్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
2014 మార్చి 24న "ఏ జట్టు గెలిచింది అన్నది అనవసరం. తాను ఇక్కడ ఉన్నది అభిమానులను అలరించేందుకే." అంటూ అప్పుడు ధోని ట్వీట్ చేశాడు. సాధారణంగా ఈ స్టార్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండకపోయినప్పటికీ అతడు పెట్టిన ప్రతీ పోస్ట్ సంచలనంగానే నిలిచింది. ఇప్పుడు మ్యాచ్‌తో ఈ ట్వీట్ మళ్లీ ట్రెండ్ అయ్యింది.
-
Doesn't matter which team wins,I am here for entertainment
— Mahendra Singh Dhoni (@msdhoni) March 23, 2014
పంత్ ఈజ్ బ్యాక్ - 159 స్ట్రైక్‌రేట్‌తో చెన్నైపై వీరబాదుడే - IPL 2024 CSK VS Delhi Capitals
ఒక్క ఇన్నింగ్స్ - ఐదు రికార్డులు సాధించిన మహీ భాయ్ - IPL 2024 DC VS CSK