David Warner Border Gavaskar Trophy : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇటీవలె రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వచ్చే నెలలో ప్రారంభం కానున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టుకు అవసరమైతే అందుబాటులోకి వస్తానని డేవిడ్ వార్నర్ అన్నాడు. అయితే తాజాగా ఈ విషయంపై ఆయన సతీమణి క్యాండీస్ వార్నర్ క్లారిటీ ఇచ్చింది. ఆయన వచ్చే అవకాశాలు లేవని ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
"అతను ఆస్ట్రేలియాకు ఆడేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సెలెక్టర్ జార్జ్ బెయిలీ లేకుంటే కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ఫోన్ చేసి 'మాకు నువ్వు కావాలి' అని చెబితే, వెంటనే వెళ్లిపోతాడు. అయితే అది కచ్చితంగా జరగదు." అని కాండిస్ అన్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ తర్వాత టెస్ట్ క్రికెట్ నుంచి వార్నర్ తప్పుకున్న సంగతి తెలిసిందే. 112 మ్యాచుల్లో 26 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు చేశాడు. మొత్తం 8,786 పరుగులతో అద్భుతమైన కెరీర్‌కు ముగింపు పలికాడు. ఒకవేళ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తనను వెనక్కి పిలిస్తే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని వార్నర్ చెప్పాడు. కీలక బోర్డర్- గావస్కర్ సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకు, షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా పేర్కొన్నాడు. ఓ స్పోర్ట్స్ న్యూస్ వెబ్‌సైట్‌తో వార్నర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఫోన్ కాల్ దూరంలో ఉంటా - వార్నర్ మాట్లాడుతూ, "నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉంటాను. క్రికెట్‌కు సంబంధించి నేనెప్పుడూ సీరియస్‌గా ఉంటాను. ఫిబ్రవరి తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఒక టెస్టు మ్యాచ్ ఆడారు. నేను కూడా దాదాపు అంతే సన్నద్ధంగా ఉన్నా. టోర్నీలో ఆడితే చాలా సంతోషంగా ఉంటుంది. నేను సరైన కారణాల వల్ల ఆటకు వీడ్కోలు పలికాను. కానీ అవసరమైతే జట్టు తరఫున ఎప్పుడూ ముందుంటా. ఈ విషయంలో సిగ్గుపడను" అని వార్నర్ పేర్కొన్నాడు.
వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్! - ఆ స్టార్ హీరో సినిమాలో కేమియో రోల్లో! - David Warner Telugu Movie