David Warner misses Hyderabad: ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌కు తెలుగు క్రికెట్ ఫ్యాన్స్‌కు మంచి అనుబంధం ఉంది. వార్నర్ ఐపీఎల్లో సన్‌రైజర్స్ జట్టుకు ప్రాతనిధ్యం వహించడంతోపాటు తెలుగు హీరోల సినిమాల్లోని ఎన్నో సాంగ్స్‌ను రీల్స్‌గా చేసి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లోని పాటలకు స్టెప్పులు వేసి, డైలాగ్స్ చెప్పి తెలుగు ఆడియెన్స్‌కు మరింత దగ్గరయ్యాడు. దీంతో వార్నర్‌కు తెలుగు క్రికెట్ ఫ్యాన్స్‌తో చక్కటి అనుబంధం ఏర్పడింది.
అటు వార్నర్ కూడా తరచూ తెలుగు ఫ్యాన్స్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటాడు. తాజాగా సోషల్ మీడియా పోస్ట్‌తో వార్నర్ మరోసారి తెలుగు అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. రంగురంగుల కాంతుల మధ్యలో వెలిగిపోతున్న ఛార్మినార్ ఫొటో ఒకటి షేర్ చేస్తూ, 'నాకు నచ్చిన ప్రదేశాలలో ఒకదాన్ని చాలా మిస్ అవుతున్నాను' అని రాసుకొచ్చాడు. దీంతో వార్నర్‌కు హైదరాబాద్‌తో విడదీయరాని బంధం ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 2025 ఐపీఎల్ మెగా వేలంలో ఎలాగైనా సన్‌రైజర్స్ వార్నర్‌ను కొనుగోలు చేస్తే బాగుంటుందని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
INSTAGRAM STORY OF DAVID WARNER...!!!!
— Johns. (@CricCrazyJohns) August 26, 2024
- Warner loves Hyderabad a lot. ❤️ pic.twitter.com/cUCYJCWQ02
కాగా, 2014- 2021 మధ్యలో వార్నర్ సన్‌రైజర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 2016 ఎడిషన్‌లో తన సారథ్యంలోనే సన్‌రైజర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ ఎనిమిది ఎడిషన్లలో కలిపి వార్నర్ సన్‌రైజర్స్ తరఫున 95మ్యాచ్‌లు ఆడాడు. అందులో 142.59 స్ట్రైక్ రేట్‌తో 4014 పరుగులు చేశాడు. ఇక 2022 ఐపీఎల్‌కు ముందు సన్‌రైజర్స్ వార్నర్‌ను వదులుకుంది. అప్పుట్నుంచి ఈ డాషింగ్ ఓపెనర్ దిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నాడు.
బన్ని- వార్నర్ తగ్గేదేలే
కరోనా సమయంలో, ఆ తర్వాత రీల్స్‌తో హీరో అల్లు అర్జున్- వార్నర్ మధ్య స్నేహం ఏర్పడింది. వీరిద్దరూ వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవకపోయినా, ఆన్లైన్లో ఇరువురు అప్పుడప్పుడు పలకరించుకుంటారు. పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్‌గా విషెస్ చెప్పుకుంటారు. ఇక వార్నర్ ఇప్పటికి అనేక సార్లు పుష్ప సినిమా 'తగ్గేదేలే' డైలాగ్ మేనరిజాన్ని గ్రౌండ్లో అనేక సార్లు చేసి ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషి చేశాడు.
Warner On Allu Arjun : 'పుష్ప'కు వార్నర్ విషెస్.. వెల్డన్ అంటూ..